Liger: పూరి జగన్నాథ్ పుట్టిన రోజు నాడు లైగర్ నుంచి బిగ్ అప్‎డేట్

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ సినిమా టీజర్ ఎప్పుడు రానుందో తెలిసిపోయింది. దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు నాడు టీజర్‎ను విడుదల చేయాలని నిర్ణయించారు.

Liger: పూరి జగన్నాథ్ పుట్టిన రోజు నాడు లైగర్ నుంచి బిగ్ అప్‎డేట్
Liger Movie
Follow us
Phani CH

|

Updated on: Sep 26, 2021 | 4:46 PM

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ సినిమా టీజర్ ఎప్పుడు రానుందో తెలిసిపోయింది. దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు నాడు టీజర్‎ను విడుదల చేయాలని నిర్ణయించారు. పూరి దర్శకత్వంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా లైగర్ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‎లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ స్టేడియం సెట్ నిర్మించి అందులో చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల చివరికి గోవాలో షూటింగ్ ముగియనుంది. లైగర్ టీం తదుపరి షూటింగ్‎కు విదేశాలకు వెళ్లనుంది.

విదేశాలక వెళ్లే ముందే లైగర్ టీం అభిమానులకు సర్‎ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది. సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టిన రోజు నాడు లైగర్ టీజర్‎ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నేడో రేపో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టీజర్‎ను విజయ్ దేవరకొండ బర్త్ డే మే 9 నాడు విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ వల్ల రిలీజ్ చేయలేకపోయారు. అప్పటి నుండి లైగర్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్‎గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో పూర్తి చేసి.. సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరోవైపు గోవాలో పూరి జగన్నాథ్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Perni Nani: ఏపీలోనే నిర్మాతలకు ఎక్కువ షేర్‌.. జనసేన అధినేత పవన్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్..

Aditya Birla AMC IPO: సెప్టెంబర్ 29 నుంచి అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓ