Liger Pre Release Event :ఈ సినిమాలో విజయ్ ఇరగదీసాడు.. అనన్య చింపేసింది : పూరీ జగన్నాద్

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ లైగర్.. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

Liger Pre Release Event :ఈ సినిమాలో విజయ్ ఇరగదీసాడు.. అనన్య చింపేసింది : పూరీ జగన్నాద్
Puri Jagannadh
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 9:58 PM

Liger Pre Release Event : టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ లైగర్.. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో లైగర్ టీమ్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలోనూ లైగర్ హడావిడి కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గుంటూరు లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ..

మిమ్మల్ని చూస్తుంటే సినిమా ప్రమోషన్స్ కొచ్చామా.. లేక సక్సెస్ మీట్ కొచ్చామా అనిపిస్తోంది.. మీరు ఒక్కొక్క టికెట్ కొనండి సినిమా సూపర్ హిట్ అయిపోద్ది. ఈ సినిమాలో విజయ్ ఇరగదీసాడు.. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ కూడా అదరగొట్టేశారు. మైక్ టైసన్ ను కొట్టే మగడు ఎవ్వడు లేడు..అలాంటి ఆయన మా సినిమాలో నటించారు. మైక్ టైసన్ గురించి తెలుసుకోండి.. ఇప్పటికే లెట్ అయ్యింది మేము ఈ సినిమాను ప్రేమ తో చేశాం.. ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు ఎంత కలెక్ట్ చేస్తుందో లేదో తెలియదు. ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ తో జనగణమన సినిమా చేస్తున్నాం అన్నారు పూరీజగన్నాథ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి