AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: ఓటేసాకే షూటింగ్‌లకు రండి.. ఆర్టిస్ట్‌లకు నిర్మాత మండలి విజ్ఞప్తి..

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే..

MAA Elections 2021: ఓటేసాకే షూటింగ్‌లకు రండి.. ఆర్టిస్ట్‌లకు నిర్మాత మండలి విజ్ఞప్తి..
Maa
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2021 | 2:57 PM

Share

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ ఇద్దరు తమ ప్యానల్స్‌తో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. మా ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచే.. ‘మా పోరు’ ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తూ.. రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు.. ప్రత్యర్థులు.. ప్లాన్లు, పార్టీలు.. ఆడియో రికార్డుల లీకులు.. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ఫైటింగ్‌లు ఇలా.. రకరకాలుగా సాగుతూ..రాజకీయాలనే తలదన్నుతోంది. ఎలక్షన్ డేట్ అక్టోబర్ 10 దగ్గరకు రావడంతో.. అభ్యర్థులు ఈ తరహా ప్రచారాలకే ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తూ… ‘మా’ మెంబర్స్‌ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.  ఆ మధ్య గణపతి కాంప్లెక్స్‌ ఏరియాలో చిన్న కళాకారులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు ప్రకాశ్‌రాజ్‌. మరోవైపు మంచు విష్ణు సినీ పెద్దలను కలుస్తూ తమ మద్దతు కోరుతున్నారు.

ఈ నేప‌థ్యంలో నటీనటులకు నిర్మాతల మండలి ఓ విజ్ఞప్తి చేసింది. ‘మా’ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఈ నెల 10వ‌ తేదీన ఓటు వేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలని నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. షూటింగ్ ల కారణంగా ఎవ్వరుకూడా తమ ఓటును దుర్వినియోగం చేసుకోకూడదని ఎన్నికల అధికారి నిర్మాత‌ల మండ‌లికి అభ్యర్థన చేయ‌డంతో ఆ మండ‌లి ఈ ప్ర‌కట‌న చేసింది. ఇక ఆదివారం ఉదయం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఎన్నికలు జరగనున్నాయి.  మొద‌ట ఈ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షులుగా ఐదుగురు పోటీ చేయాల‌ని భావించారు. చివ‌ర‌కు ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మాత్ర‌మే పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Samantha: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. వైరల్ అవుతున్న సమంత ఓల్డ్ పోస్ట్..

Aryan Khan Drugs Case: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీలో అసలు నిజాలేంటి ? షారూఖ్‌ కొడుకు అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందా?

Sonu Sood: ఆపద్భాంధవుడు సోనూసూద్‌కు గుడి నిర్మాణం.. నిత్యపూజలు. ఎక్కడంటే..?

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..