NTR: “ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది”.. ఇంట్రస్టింగ్ విషయం చెప్పిన నిర్మాత కూతురు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తారక్ క్రేజీ ఈ మధ్య కాలంలో డబుల్ అయ్యింది. మొన్నటి వరకు టాలీవుడ్ టాలీవుడ్ పక్కనున్న కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే తారక్ కు ఫ్యాన్స్ ఉండే వాళ్ళు.

NTR: ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. ఇంట్రస్టింగ్ విషయం చెప్పిన నిర్మాత కూతురు
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2022 | 3:22 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తారక్ క్రేజీ ఈ మధ్య కాలంలో డబుల్ అయ్యింది. మొన్నటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ పక్కనున్న కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే తారక్ కు ఫ్యాన్స్ ఉండే వాళ్ళు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్. తారక్ డాన్స్ కు , యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరేమో. ఇదిలా ఉంటే తన పెళ్ళికి తారక్ కారణమంటూ ఆయన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రముఖం నిర్మాత కూతురు. ఆమె ఎవరో కాదు బడా ప్రొడ్యూసర్ అశ్వినిదత్ కుమార్తె స్వప్నా దత్. స్వప్నా దత్ ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010లో వీరి వివాహం జరిగింది.

అయితే తమ ప్రేమ వ్యవహారం గురించి తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. తన వివాహం జరగడానికి ఒక విధంగా ఎన్టీఆర్ కారణం అని తెలిపింది. తాను ప్రేమలో ఉన్నప్పుడు ఆ విషయాన్నీ తారక్ కు చెప్పారట స్వప్న. అయితే ఈ విషయాన్నీ వెంటనే ఇంట్లో చెప్పేయమని అన్నారట.. అయితే అప్పుడు ప్రేమ వివాహానికి మా ఇంట్లో ఒప్పుకునే పరిస్థితి లేదు అండంతో.. ‘ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయకూడదు.. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను’ అని షూటింగ్ మధ్యలోనే మా ఇంటికి వచ్చి నాన్న గారితో మాట్లాడాడు. అలా మా పెళ్ళికి తారక్ మూలకారణం అయ్యాడు అని అన్నారు స్వప్న. ఇక అశ్వినీదత్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఫ్యామిలోకి మంచి అనుభందం ఉన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Swapna Dutt Ntr

Swapna Dutt Ntr

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి