AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీతో విబేధాలపై ఓపెన్ అయిన అల్లు అరవింద్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

అయితే గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీ.. అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని రకరకాల కథానాలు వస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలతో ఈ వార్తలకు చెక్ పెట్టారు మెగాస్టార్.

Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీతో విబేధాలపై ఓపెన్ అయిన అల్లు అరవింద్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు
Allu Aravind
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2022 | 11:30 AM

Share

దివగంత హాస్యనటుడు రామలింగయ్య కుమారుడిగా.. తెలుగు చిత్రపరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే తన మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. పలు పండుగలకు ఈ రెండు కుటుంబాలు ఒక్కచోట చేరి సరదాగా గడిపేస్తుంటారు. అల్లు అర్జున్.. రామ్ చరణ్ మధ్య అనుబంధం గురించి చెప్పక్కర్లేదు. ఈ రెండు కుటుంబాల నుంచి వచ్చిన హీరోలు తమ ప్రతిభతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీ.. అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని రకరకాల కథానాలు వస్తున్నాయి.

ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలతో ఈ వార్తలకు చెక్ పెట్టారు మెగాస్టార్. అల్లురామలింగయ్య శతజయంతి ఉత్సవాలలో మెగాస్టార్ కుటుంబం పాల్గొంది. ఈ వేడుకలలో అల్లు అరవింద్.. చిరు.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ సరదాగా కనిపించారు. తాజాగా ఇదే విషయంపై అలీతో సరదాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్.

ఇవి కూడా చదవండి

అల్లు ఫ్యామిలీకి.. మెగా కుటుంబానికి చిన్న భేదాభిప్రాయం వచ్చిందని టాక్.. ఇందులో నిజమెంత ? అని అలీ అడగ్గా.. ” సమాజంలో ఇలా అనుకోవడం సహజం. నేను చిరంజీవి మంచి స్నేహితులం. మేము బావబావమరుదులుగా కాకుండా మంచి స్నేహితులుగా ఉన్నాం. అలాగే జీవితంలో పైకి వచ్చాం. కాలానుగుణంగా మా కుటుంబంలో సభ్యులు పెరిగారు. అందరిలోనూ పోటీతత్వం ఏర్పడింది. ఎవరి స్థానాన్ని వారు పదిలపరుచుకుంటూ పైకి ఎదుగుతున్నారు. ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. వీళ్లందరూ ఒక్కటే. వీళ్లలో ఎవరిని ఏమన్నా అందరూ ఒక్కమాట మీద ఉంటారు. ఈ విషయం అందరికీ తెలియాలి. మేము సంక్రాంతి, దీపావళికి మా కుటుంబంతో సహా చిరంజీవి ఇంటికి వెళ్తాం. ఇవ్వన్నీ అందరికీ తెలియాలని మేము వీడియోస్ కూడా తీసి పెట్టం కదా. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి ” అంటూ చెప్పుకొచ్చారు.