AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సాయి పల్లవి జీవితంలోనే ప్రత్యేకమైన క్షణాలు.. ఇలాంటి రోజులు ఎప్పుడు జరగవంటూ న్యాచురల్ బ్యూటీ ఎమోషనల్..

ఇటీవల విరాటపర్వం, గార్గి చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీస్ తర్వాత సాయి పల్లవి నుంచి మరే ప్రాజెక్ట్ అప్డే్ట్స్ రాలేదు. తాజాగా తన జీవితంలో ప్రత్యేక క్షణాలు తరచూ రావంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Sai Pallavi: సాయి పల్లవి జీవితంలోనే ప్రత్యేకమైన క్షణాలు.. ఇలాంటి రోజులు ఎప్పుడు జరగవంటూ న్యాచురల్ బ్యూటీ ఎమోషనల్..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2022 | 12:01 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా లేడీ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మకు సౌత్ ఇండిస్ట్రీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి పల్లవి కోసమే థియేటర్లకు వచ్చే జనాలున్నారంటే అతిశయోక్తి లేదు. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తూ.. నటనతో ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. న్యాచురల్ బ్యూటీ.. మయూరాన్ని మరిపించే తన నృత్యంతో ఆడియన్స్ మది దొచుకుంది. కంటెంట్.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది సాయిపల్లవి. ఇటీవల విరాటపర్వం, గార్గి చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీస్ తర్వాత సాయి పల్లవి నుంచి మరే ప్రాజెక్ట్ అప్డే్ట్స్ రాలేదు. తాజాగా తన జీవితంలో ప్రత్యేక క్షణాలు తరచూ రావంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.

ఆదివారం బెంగుళూరులో జరిగిన ఫిలింఫేర్ అవార్డులలో సాయి పల్లవి ఉత్తమ నటిగా రెండు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆమె నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు ఉత్తమ నటిగా రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. ” జీవితంలో ఇలాంటి రోజులు తరచుగా జరగవు!.. ఒకే సంవత్సరం రెండు చిత్రాలకు ప్రశంసలు అందుకోవడం చాలా ప్రత్యేకం. ఈ పాత్రల పట్ల నాకు లభించిన అపారమైన ప్రేమకు నేను కృతజ్ఞురాలిని. అలాగే ఇలాంటి అందమైన పాత్రలను నేను మరెన్నో పొందాలని ప్రార్థిస్తున్నాను.” అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అలాగే తనకు వచ్చిన రెండు అవార్డులతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేసింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ పాత్రలో సాయి పల్లవి దేవదాసి పాత్రలో నటించింది. అలాగే అక్కినేని నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి పోషించిన పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగానే కనెక్ట్ అయ్యాయి. ఇందులో ఆమె నటన అద్భుతం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే