AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayan-Vignesh Shivan: ముదురుతున్న సరోగసి వివాదం.. ఆసక్తికర పోస్ట్ చేసిన నయన్ దంపతులు..

అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.

Nayan-Vignesh Shivan: ముదురుతున్న సరోగసి వివాదం.. ఆసక్తికర పోస్ట్ చేసిన నయన్ దంపతులు..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2022 | 11:04 AM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు కవల పిల్లలకు తల్లదండ్రులయిన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారంటూ అక్టోబర్ 9న విఘ్నేష్ శివన్ పిల్లల పాదాల ఫోటోస్ షేర్ చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది… కానీ అసలు రగడ ఇక్కడే మొదలైంది. నయన్, విఘ్నేష్ జూన్ 9న ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి వివాహం జరిగి నాలుగు నెలలు కావడం..సరోగసి పద్దతిలో కవలలు జన్మించడంతో నయన్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో సరోగసి పద్దతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం నిషేదం. ఏడాది జనవరి నుంచి ఈ చట్టం అమలులో ఉంది. అయితే నయన్ దంపతులు ఈ పద్దతి ద్వారా తల్లిదండ్రులుగా మారడం వివాదంగా మారింది. ఈ జంటకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.

తాజాగా విఘ్నేష్ శివన్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన మెసేజ్ చర్చనీయాశంగా మారింది. “అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపికపట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. ” అనే కోట్ షేర్ చేశారు. మీపై శ్రద్ద చూపించే వ్యక్తులపై మీరు శ్రద్ద చూపించండి. వారు ఎప్పుడు అక్కడే ఉంటారు. మీ మంచి కోరే ప్రజలు కావాలి అనే కోట్ షేర్ చేశారు. విఘ్నేష్ షేర్ చేసిన కోట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిన నయన్ దంపతులు ఈ విషయం పై నేరుగా స్పందించేందుకు ఇష్టపడడంలేదన్నట్లుగా తెలుస్తోంది.

గత ఆరేళ్లుగా నయన్,విఘ్నేష్ ప్రేమలో ఉన్నారు. ఈఏడాది జూన్ 9న మహాబలిపురంలో ఈజంట పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి షారుఖ్ ఖాన్, రజినీకాంత్, ఏఆర్ రెహమాన్, జ్యోతిక, సూర్య విచ్చేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది నయన్. ప్రస్తుతం ఆమె షారుఖ్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి
Nayan Vignesh

Nayan Vignesh