AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Agarwal: గ్రామాన్ని దత్తత తీసుకున్న నిర్మాత కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత.. హాజరైన ప్రముఖులు

కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

Abhishek Agarwal: గ్రామాన్ని దత్తత తీసుకున్న నిర్మాత కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత.. హాజరైన ప్రముఖులు
Abhishek Agarwal
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2022 | 7:46 PM

Share

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తిమ్మాపూర్ కేబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జన్మస్థలం కావడం మరో విశేషం. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ హైదరాబాద్‌ లోని జే ఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ , వివేక్ అగ్ని హోత్రి, పల్లవి జోషి, పీవీ సింధు, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి నందగోపాల్, శ్రీమతి కావ్య రెడ్డి, స్నేహలతా అగర్వాల్, నిశాంత్ అగర్వాల్, అర్చన అగర్వాల్, సోనమ్ అగర్వాల్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ని ఆవిష్కరించారు. తిమ్మాపూర్ గ్రామ విద్యార్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ కుటుంబం ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అభిషేక్ అగర్వాల్ తండ్రి గారి పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత ఆనందకరమైన విషయం. గొప్ప పనులు చేసేవారికి అందరి ఆశీస్సులు వుంటాయి. అభిషేక్ అగర్వాల్ వెంట మేముంటాం. తిమ్మాపూర్ లో మళ్ళీ కలుస్తాం. విద్యార్ధులందరికీ నా ఆశీస్సులు. అలలకు భయపడితే పడవ ముందుకు వెళ్ళలేదు. ప్రయత్నించేవారికి ఓటమి వుండదు. మీరంతా గొప్పగా ఎదగాలి.” అని కోరారు

అలాగే పీవీ సింధు మాట్లాడుతూ.. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అభిషేక్ అగర్వాల్ గారి గొప్ప మనసుకు హ్యాట్సప్. తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నీ మౌలిక వసతులు కల్పించడానికి సంకల్పించారు. గ్రామంలోని విద్యార్ధులు కూడా చక్కగా చదువుకొని మరెందరికో స్ఫూర్తిని ఇవ్వాలి. అభిషేక్ అగర్వాల్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్”అని చెప్పుకొచ్చింది పీవీ సింధు.

ఇవి కూడా చదవండి