Priyanka Chopra: ఇక వారితో పనిచేయదలచుకోవట్లేదు.. ప్రియాంక చోప్రా షాకింగ్ నిర్ణయం
ఒకప్పుడు టాలెరేట్ చేసిన విషయాలను ఇక సీరియస్‌గా తీసుకుంటానంటున్నారు. ఇక్కడ బేరాల్లేవమ్మా.. అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. ప్రియాంక చోప్రాకు మన దగ్గరే కాదు, హాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.

మన మాటకు ఓ విలువ ఉండాలంటే ఎదిగి చూపించాలి. ఒక్కసారి గట్టిగా ఎదిగాక ఏం చెప్పినా తిరుగే ఉండదు. ఈ విషయాన్ని ఓపెన్‌గా చేసి చూపిస్తున్నారు హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఒకప్పుడు టాలెరేట్ చేసిన విషయాలను ఇక సీరియస్‌గా తీసుకుంటానంటున్నారు. ఇక్కడ బేరాల్లేవమ్మా.. అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. ప్రియాంక చోప్రాకు మన దగ్గరే కాదు, హాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. మొన్నటికి మొన్న హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, అక్కడ బిజినెస్ సర్కిల్స్ లోనూ తనదైన ముద్ర వేశారు. మనం చెప్పే మాటకు విలువ రావాలంటే, ముందు చేసి చూపించాలి. మన చేతలు మాట్లాడే మాటలకు పదునెక్కువ అని అంటున్నారు పీసీ
ఆమె నటించిన సిటాడెల్ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలతో మాట్లాడుతున్నారు పీసీ. ఈ క్రమంలోనే కొత్తగా ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా? అనే ప్రశ్న ఎదురైంది మిసెస్ చోప్రా జోనాస్‌కి. ఈ సారి తీసుకున్న నిర్ణయంలో బేరాలుండవమ్మా అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు ప్రియాంక.
తనకు నచ్చనివారితో ఇక పనిచేయదలచుకోవట్లేదు పీసీ. తనకున్న సమయాన్ని స్ఫూర్తి పంచేవారితోనే గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాను సెట్‌కి వెళ్తున్న ప్రతిసారీ అక్కడ ఎవరిని కలవబోతున్నారనే విషయం మీద నోట్స్ రాసుకుంటున్నట్టు తెలిపారు. షూటింగ్ స్పాట్‌ని కేవలం వర్కింగ్ ప్లేస్‌గానే చూడకుండా, ఎడ్యుకేషనల్ ప్లేస్‌గా ట్రీట్ చేయాలని ఫిక్స్ అయ్యానంటున్నారు మేడమ్ ప్రియాంక. హాలీవుడ్ సిటాడెల్‌లో నటించిన పీసీ, ఇండియన్ సిటాడెల్‌లో నటిస్తున్న వరుణ్ ధావన్‌కీ, సమంతకు ఏవైనా సజెషన్స్ ఇస్తారా? అని అడిగితే.. వాళ్లు చాలా బాగా నటిస్తున్నారు. ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. ఇప్పుడు నేనెళ్లి వారికి స్పెషల్‌గా చెప్పాల్సింది ఏమీ లేదని అనేశారు ప్రియాంక.




