Priyamani: మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ప్రియమణి
తెలుగులోనే కాదు తమిళ్ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ బిగినింగ్ లోతమిళ్ సినిమాల్లో ప్రియమణి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. ఇక రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్టయిన షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో నటించిన ప్రియమణి ఇప్పుడు మరో స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ప్రియమణి తెలుగులోనే కాదు తమిళ్ , కన్నడ, హిందీతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అందం, అభినయం ఉన్న బ్యూటీ ప్రియమణి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. హీరోయిన్ గానే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటిస్తూ తన సత్తా చాటుతుంది. ఈ అమ్మడు తెలుగులోనే కాదు తమిళ్ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ బిగినింగ్ లోతమిళ్ సినిమాల్లో ప్రియమణి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. ఇక రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్టయిన షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో నటించిన ప్రియమణి ఇప్పుడు మరో స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ప్రియమణి తెలుగులోనే కాదు తమిళ్ , కన్నడ, హిందీతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రియమణి ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో నటించనున్నారని తెలుస్తుంది. మోహన్ లాల్ ‘నేరు’లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రియమణి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు మరియు నటి ప్రియమణి ఇప్పటికే ‘నెరు’ సినిమా షూటింగ్ ప్రారంభించింది.
View this post on Instagram
‘నేరు’ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో మోహన్ లాల్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్. మరోసారి మోహన్‌లాల్ కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘నేరు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కోర్ట్ రూమ్ డ్రామాగా ఉంటుందని, మోహన్ లాల్ లాయర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. అలాగే ప్రియమణి కూడా లాయర్ పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram
బెంగళూరులో జన్మించిన ప్రియమణి తన నటనతో నేషనల్ అవర్డ్ కూడా సొంతం చేసుకుంది. 2007లో విడుదలైన తమిళ చిత్రం ‘పరుత్తివీరన్’లో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 2003లో నటించడం ప్రారంభించిన ప్రియమణి తెలుగులో చాలా సినిమాల్లో నటించింది ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ప్రియమణికి పెద్ద హిట్ అందించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..