TOP 9 ET: వాట్సాప్‌లో నెంబర్ 1 మనోడే.. | స్పీడుమీదున్న ఆయన.. ఈయన..

TOP 9 ET: వాట్సాప్‌లో నెంబర్ 1 మనోడే.. | స్పీడుమీదున్న ఆయన.. ఈయన..

Anil kumar poka

|

Updated on: Sep 15, 2023 | 9:04 AM

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కోసం సెట్లో అడుగుపెట్టారు పవన్‌ కల్యాణ్‌. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. సెట్లో ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. గబ్బర్‌సింగ్‌ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. - సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీకి సర్వం సిద్ధమైందనే మాట వినిపిస్తోంది. ఆమిర్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌తో జోడీ కట్టడానికి సాయిపల్లవి ఓకే చెప్పారట.

01.Vijay Devarakonda
ఖుషి సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ మరింత ఖుషీ అయ్యే న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతోంది. తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ఛానల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లిస్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌ చానల్‌ క్రియేట్ చేసిన తొలి టాలీవుడ్ యాక్టర్‌గా నిలిచారు విజయ్‌. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ.

02.Allu arjun
షారుఖ్ హీరోగా నటించిన జవాన్‌ సినిమా పెద్ద విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. షారుఖ్‌ మాసియస్ట్ అవతార్‌లో కనిపించారని అన్నారు. విజయ్‌ సేతుపతి ఎప్పటిలాగే అదరగొట్టారని చెప్పారు. దీపిక ప్రెజెన్స్, నయనతార షైన్‌, అట్లీ మేకింగ్‌ అదుర్స్ అని మెచ్చుకున్నారు.

03.Gunturu karam
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. 2024 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్‌తో పాటు కీలక నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్రివిక్రమ్‌ – మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి.

04.Ustaad
ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కోసం సెట్లో అడుగుపెట్టారు పవన్‌ కల్యాణ్‌. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. సెట్లో ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. గబ్బర్‌సింగ్‌ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.

05.Sai pallavi
సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీకి సర్వం సిద్ధమైందనే మాట వినిపిస్తోంది. ఆమిర్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌తో జోడీ కట్టడానికి సాయిపల్లవి ఓకే చెప్పారట. విరాటపర్వం తర్వాత సాయిపల్లవి తెలుగులో ఏ సినిమాకూ సైన్‌ చేయలేదు. తమిళంలో మాత్రం ఓ సినిమా చేస్తున్నారు.

06.Hi Nanna
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న సినిమా హాయ్‌ నాన్న. మృణాల్‌ ఠాకూర్‌ నాయికగా నటిస్తున్నారు. లవ్‌ యాక్షన్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు నాని. హాయ్‌ నాన్న ఆల్బమ్‌ అద్భుతంగా వచ్చిందని అన్నారు.

07.Varun Tej
వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్‘. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8నే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.

08.800
ప్రముఖ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా 800. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచీ ఈ సినిమా మీద క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్‌ 6న 800 సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

09. LEO
విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా లియో. లోకేష్‌ కనగరాజ్‌ డైరక్ట్ చేస్తున్నారు. అక్టోబర్‌ 19న లియో విడుదల కానుంది. ఈ సినిమాను వితౌట్‌ కట్స్ తో విడుదల చేయనున్నట్టు యుకె డిస్ట్రిబ్యూటర్‌ ప్రకటించారు. లోకేష్‌ యూనివర్శ్‌ అందరికీ రీచ్‌ అయిందని అనిపించినప్పుడు పన్నెండేళ్ల లోపు పిల్లలను అనుమతించే వెర్షన్‌ను ప్రదర్శిస్తామని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..