800 Movie: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ‘800’ ఎప్పుడు రానుందంటే?
బొంగరాల్లా తిరిగే బంతులు వేస్తూ శ్రీలంక జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు మురళీధరన్. అతను బౌలింగ్‌కు దిగితే ప్రత్యర్థులు వణికిపోయేవారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో మురళీధరన్ ప్రస్థానం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎంట్రీ మొదలు చకింగ్ ఆరోపణలతో పలు సార్లు జట్టుకు దూరమయ్యాడు. ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు కాబట్టే మురళీధరన్ జీవితంపై బయోపిక్ తెరకెక్కుతోంది. ఇటీవలే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 800 సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు
శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 800. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 800కు పైగానే. అందుకే ఈ ముత్తయ్య సినిమాకు ఈ టైటిల్‌నే ఖరారు చేశారు. బొంగరాల్లా తిరిగే బంతులు వేస్తూ శ్రీలంక జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు మురళీధరన్. అతను బౌలింగ్‌కు దిగితే ప్రత్యర్థులు వణికిపోయేవారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో మురళీధరన్ ప్రస్థానం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎంట్రీ మొదలు చకింగ్ ఆరోపణలతో పలు సార్లు జట్టుకు దూరమయ్యాడు. ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు కాబట్టే మురళీధరన్ జీవితంపై బయోపిక్ తెరకెక్కుతోంది. ఇటీవలే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 800 సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పలు భాషల్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. ముత్తయ్య మురళీధరన్ పేద కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. మంచి స్పిన్ బౌలర్‌గా మారాడు. కెరీర్‌లో 800 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్‌కు పేరుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ జీవితం అనేక ఆసక్తికరమైన అంశాలతో నిండి ఉంది. ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. అవన్నీ ట్రైలర్‌లో కూడా చూపించారు. ఇక శ్రీలంక జట్టు క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లింది. ఆ సమయంలో జట్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో బస్సులో ముత్తయ్య కూడా ఉన్నాడు. దీన్ని కూడా బయోపిక్‌లో చేర్చారు. దీంతో పాటు మురళి వ్యక్తిగత ఆలోచనలు ఈ సినిమాలో ఉన్నాయి.
‘800’ సినిమా ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కింది . జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో నటించిన మధుర్ మిట్టల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘800’. ముత్తయ్య భార్య పాత్రలో మహిమా నంబియార్ నటించింది. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సచిన్ టెండూల్కర్ విడుదల చేశారు. కాగా క్రికెటర్ల జీవితంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందుకు మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ఎం.ఎస్.’ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మంచి ఉదాహరణ. ఇప్పుడు ముత్తయ్య మురళీధరన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ‘800’ సినిమా కూడా అభిమానులను అలరిస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.
800 మూవీ ట్రైలర్
View this post on Instagram
అక్టోబర్ 6న గ్రాండ్ రిలీజ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.