AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vineeth: హీరో వినీత్ కూతురు ఎంత క్యూట్‏గా ఉందో చూశారా..? వైరలవుతున్న ఫ్యామిలీ ఫోటోస్..

ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినీరంగానికి దూరంగా ఉన్నాడు. తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న వినీత్.. ఇప్పుడిప్పుడే తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. వినీత్.. హీరోగానే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా. ముఖ్యంగా భరతనాట్యంలో అనేక కచేరీలలో తన ప్రతభను ప్రదర్శించాడు.

Actor Vineeth: హీరో వినీత్ కూతురు ఎంత క్యూట్‏గా ఉందో చూశారా..? వైరలవుతున్న ఫ్యామిలీ ఫోటోస్..
Vineeth
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2024 | 10:51 AM

Share

90వ దశకంలో దక్షిణాదిలో సినీ ప్రియులకు ఇష్టమైన హీరో వినీత్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996లో విడుదలైన ప్రేమదేశం సినిమాతో యూత్‏లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వినీత్.. ఆ తర్వాత తెలుగులో జెంటిల్ మెన్, సరిగమలు, W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో సహయ నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినీరంగానికి దూరంగా ఉన్నాడు. తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న వినీత్.. ఇప్పుడిప్పుడే తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. వినీత్.. హీరోగానే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా. ముఖ్యంగా భరతనాట్యంలో అనేక కచేరీలలో తన ప్రతభను ప్రదర్శించాడు.

వెండితెరపై హీరోగా అలరించిన వినీత్.. విదేశాల్లో పలు భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అలాగే ఇండస్ట్రీలో భరతనాట్య కళాకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వినీత్.. నెట్టింట కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈహీరో ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వినీత్.. 2004 ఆగస్ట్ 28న చెన్నైకు చెందిన ప్రిస్సిల్లా మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పాప అవంతి వినీత్ జన్మించింది. సాధారణంగా వినీత్ ఫ్యామిలీ బయట ఎక్కడ కనిపించదు. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలలో వినీత్ ఫ్యామిలీ కనిపించదు. కానీ తాజాగా నెట్టింట వినీత్ ఫ్యామిలీ ఫోటోస్ మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Vineeth Family

Vineeth Family

వినీత్, ప్రిస్సిల్లాది పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రిస్సిల్లా బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు. వీరిద్దరి వివాహ రిసెప్షన్ వేడుక సెప్టెంబర్ 5, 2004న జరిగింది. చెన్నైలో జరిగిన వేడుకకు సినీ రంగానికి చెందిన స్నేహితులు హాజరయ్యారు. వినీత్ ఆరేళ్ల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక నృత్య బహుమతులు గెలుచుకున్నాడు. వరుసగా నాలుగు సంవత్సరాలు కేరళ స్కూల్ కలోసవంలో మొదటి బహుమతిని అందుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.