AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరంజీవి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న కుర్రాడు ఎవరో తెలుసా..? ఆ సీనియర్ హీరో కొడుకు..

ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ హీరో తన చిన్నప్పుడు చిరంజీవి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో షేర్ చేశాడు. అందులో చిరుతోపాటు ఆయన తండ్రి కూడా కనిపిస్తున్నారు. పైన ఫోటోలను చూశారు కదా..అందులో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? అతడు ఇప్పుడు తెలుగు సినీరంగంలో గుర్తింపు ఉన్న హీరో. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.

Tollywood: చిరంజీవి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న కుర్రాడు ఎవరో తెలుసా..? ఆ సీనియర్ హీరో కొడుకు..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2024 | 10:16 AM

Share

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్ 22) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‏లో సెలబ్రెషన్స్ జరిగాయో చెప్పక్కర్లేదు. మెగా అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే సినీ ప్రముఖులు, నెటిజన్స్ చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరోవైపు చిరు బర్త్ డే సందర్భంగా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇంద్ర చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. థియేటర్లలో రచ్చ చేశారు మెగా ఫ్యాన్స్. యూత్ తోపాటు చిరు సీనియర్ ఫ్యాన్స్ అంతా థియేటర్లలో ఇంద్ర పాటలకు డ్యాన్సులు చేస్తూ హంగామా చేశారు. ఇంద్ర సినిమా రీరిలీజ్ సందర్భంగా యూత్ కంటే ఎక్కువగా సీనియర్ మెగా ఫ్యాన్స్ మాత్రమే థియేటర్లలో హంగామా చేసిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిరు. ఇదంతా పక్కన పెడితే.. చిరు బర్త్ డే సందర్భంగా ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు పాత ఫోటోస్ షేర్ చేసి విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ హీరో తన చిన్నప్పుడు చిరంజీవి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో షేర్ చేశాడు. అందులో చిరుతోపాటు ఆయన తండ్రి కూడా కనిపిస్తున్నారు. పైన ఫోటోలను చూశారు కదా..అందులో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? అతడు ఇప్పుడు తెలుగు సినీరంగంలో గుర్తింపు ఉన్న హీరో. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరు అనుకుంటున్నారా.. ? ఆ కుర్రాడు మరెవరో కాదు.. మెగా ప్రిన్స్, నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్.

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చిన్నప్పుడు చిరంజీవి కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోను, అలాగే తన పెళ్లిలో చిరును కౌగిలించుకున్న ఫోటోలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “మాకు ప్రతి సమస్యను నవ్వుతో ఎదుర్కోవడం నేర్పించినందుకు.. ప్రేమ, అనుబంధాలతో మమ్మల్ని పెంచినందుకు ధన్యవాదాలు.. నువ్వే మాకు అతి పెద్ద ఇన్స్పిరేషన్. నువ్వు మాతో ఉన్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్ డే డాడీ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు వరుణ్ తేజ్. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.