Prabhas: ఆ పాట ఎప్పుడు విన్నా కన్నీళ్ళువస్తాయి.. ప్రభాస్ ఎమోషనల్ కామెంట్స్

దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో డార్లింగ్ లుక్ కేక అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను లైనప్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Prabhas: ఆ పాట ఎప్పుడు విన్నా కన్నీళ్ళువస్తాయి.. ప్రభాస్ ఎమోషనల్ కామెంట్స్
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: May 18, 2024 | 11:20 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో డార్లింగ్ లుక్ కేక అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను లైనప్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను డిఫరెంట్ కాన్సెంట్ తో తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. మునుపెన్నడూ చూడని కథతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ అదిరిపోయాయి. అలాగే ఈ మూవీ భైరవగా కనిపించనున్నాడు రెబల్ స్టార్.

కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా నుంచి కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే సలార్ 2 సినిమా కూడా చేయనున్నాడు ప్రభాస్. వీటితో పాటే యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రభాస్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్ తాను నటించిన చక్రం సినిమా గురించి మాట్లాడాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచాయి. అందులో జగమంతా కుటుంబం నాది సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. తాజాగా ప్రభాస్ ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ.. అలాంటి అద్భుతమైన సాంగ్ నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాటలో చాలా డెప్త్ ఉంది. అలాంటి సాంగ్ ఒకటి ఉంటుందని అప్పటివరకూ నాకు తెలియదు. ఆ సాంగ్ విన్నప్పుడల్లా నా కళ్లలో నీళ్లు వస్తాయి. ఈసాంగ్ తర్వాత సిరివెన్నెల గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయా..కృష్ణవంశీగారి పుణ్యమా అని ఆ పాట నాకు వచ్చింది అని అన్నారు ప్రభాస్. ఇప్పుడు ఈ కామెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.