పాలిటిక్స్ పక్కనబెడితే.. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో ఓజి షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది.. అలాగే హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా పూర్తైంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 10 రోజుల షూట్ మాత్రమే జరిగింది. వీటిలో ఓజి, హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతున్నాయి. వీటి మొదటి భాగాలు 2024లోనే విడుదల కానున్నాయి.