Radhe Shyam : సినిమాపై అంచనాలు పెంచుతున్న ‘రాధేశ్యామ్’ కాన్సెప్ట్ పోస్టర్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ మూవీలే.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాడు.

Radhe Shyam : సినిమాపై అంచనాలు పెంచుతున్న 'రాధేశ్యామ్' కాన్సెప్ట్ పోస్టర్స్..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 25, 2021 | 5:23 PM

Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ మూవీలే.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో పెట్టిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ యూవీ క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.’జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీ గానే కాకుండా మంచి రొమాన్స్.. మంచి ఎమోషన్ మూవీగా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ తెలుపుతుంది. రాధేశ్యామ్’  కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు వెయిట్ వేస్తున్నారు. వింటేజ్ వండర్ గా ప్లాన్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులంతా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందమైన ప్రేమ కథ చూపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన టీజర్, పాటల్లో చూపించారు. మరి కొద్దిగంటల్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. నేడు (గురువారం) రాధేశ్యామ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో అభిమానుల చేత ట్రైలర్ ను విడుదల చేయించనున్నారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు హాజరుకానున్నారు. ఈమేరకు కాన్సెప్ట్ పోస్టర్స్ ను విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ పోస్టర్స్ సినిమా అంచనాలను ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలకపాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!