AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas- Hrithik Roshan: టెన్షన్‌లో ఫ్యాన్స్.. ప్రభాస్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ మూవీ ఉన్నట్టా..? లేనట్టా.?

ప్రభాస్, సిద్ధార్ధ్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఆల్రెడీ అఫీషియల్ కన్ఫార్మేషన్ ఇచ్చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Prabhas- Hrithik Roshan: టెన్షన్‌లో ఫ్యాన్స్.. ప్రభాస్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ మూవీ ఉన్నట్టా..? లేనట్టా.?
Prabha, Hrithik Roshan
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2023 | 9:19 AM

Share

ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు ఆ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ కాబోతుందన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై నీళ్లు చల్లేశారు పఠాన్ డైరెక్టర్‌ సిద్దార్థ్ ఆనంద్‌. ప్రభాస్, సిద్ధార్ధ్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఆల్రెడీ అఫీషియల్ కన్ఫార్మేషన్ ఇచ్చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ మరో హీరోగా నటిస్తున్నారన్నది నార్త్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ న్యూస్‌.

ప్రజెంట్‌ ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. ఈ కమిట్మెంట్స్ పూర్తయిన వెంటనే సిద్దార్ధ్‌ టీమ్‌తో జాయిన్ అవుతారన్న టాక్ వినిపించింది. ఈ న్యూస్‌తో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ అంచనాలపై నీళ్లు చల్లేశారు దర్శకుడు సిద్దార్థ్‌.

ప్రభాస్‌, హృతిక్‌ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న ప్రశ్నకు సమాధనం చెప్పకుండా.. ప్రజెంట్‌ తాను ఫైటర్‌ సినిమా మాత్రమే చేస్తున్నా అంటూ దాటవేశారు. ఈ ఆన్సర్‌తో ప్రభాస్‌ – హృతిక్‌ మూవీ ఉంటుందా లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ మల్టీ స్టారర్‌ కాకపోయినా.. సిద్దార్థ్ లాంటి యాక్షన్ స్పెషలిస్ట్‌తో ప్రభాస్‌ కలిసి వర్క్ చేస్తే.. చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌. కానీ ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లాలంటే మాత్రం మరో రెండేళ్లైనా పడుతుంది.