Samantha Ruth Prabhu: అయ్యాబాబోయ్.. సామ్ హెల్త్ కండీషన్..! అడుగు తీసి అడుగు వేయాలంటే లక్షలేనట..!!
ఇలాంటి పరిస్థితుల్లో సమంత తన ఫ్యూచర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంది.. అసలు ఐవీఐజీ చికిత్స ఎలా ఉంటుంది..
సమంత హెల్త్ కండీషన్ ఇప్పుడెలా ఉంది. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోందా..సమంత అడుగు తీసి అడుగు వేయాలన్నా లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందా.. ఇమ్యూనిటీ పెంచే ఇంట్రావీనస్ ఇమ్యూనో గ్లోబలిన్ థెరపీ అత్యంత ఖరీదైన ట్రీట్‌మెంటా.. ఓవైపు చికిత్స తీసుకుంటూనే షూటింగులకు హాజరవుతోందా.. ఇలాంటి పరిస్థితుల్లో సమంత తన ఫ్యూచర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంది.. అసలు ఐవీఐజీ చికిత్స ఎలా ఉంటుంది.. జింకలా చెంగు చెంగున ఎగిరే రామలక్ష్మి ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలన్నా లక్షలు ఖర్చుపెట్టాల్సి వస్తోందా..?
మయోసైటిస్ అంటే.. మనిషిని కుంగదీస్తుంది. ఒంట్లో బలాన్ని జ్యూస్‌లా తాగేస్తుంది. నరాల్లో పటుత్వం ఉండదు. ఎముకల్లో బలం ఉండదు..నాలుగు అడుగులు వేసేలోగా నీరసం వస్తుంది. ఉన్నట్టుండి కూలబడిపోతారు. ఒంట్లో సత్తువ అనేదే ఉండదు..శరీరంలో శక్తిని జలగలా పీల్చేస్తుంది.. అందుకే సమంత బయటకు రాలేదు. .వచ్చినా ఎక్కువ సేపు ఉండలేదు. ఉన్నా..కనీసం గంట సేపు కూడా కూర్చోలేదు. ఎక్కడ పడిపోతానేమోననే భయంతో నరకయాతన పడుతోంది. ఆ మధ్య శాకుంతల సినిమా ప్రమోషన్‌లో కూడా ఇదే మాట చెప్పింది.
మయోసైటిస్ వచ్చాక సమంత దాదాపు ఆస్పత్రికి ఇంటికే పరిమితమైంది. ఈ డిసీజ్‌కు చికిత్స ఎలా ఉంటుందంటే.. అదో నిరంతర ప్రక్రియ.. ఏమాత్రం అశ్రద్ధ చేసినా చాలా ప్రమాదం. అంత జాగ్రత్తగా ఉంటేనే సమంత ఇలా ఉంది. కరోనా టైమ్‌లో కొవిడ్ సోకితే ఒంట్లో బలాన్నంతా వైరస్ లాగేస్తుంది.. ఇమ్యూనిటీ పెంచే పుడ్ తీసుకోవాలని చెప్పేవాళ్లు..సమంత ప్రస్తుత పరిస్తితి ఎలా ఉందంటే.. ఒకవైపు మయోసైటిస్ నుంచి బయటపడాలి.. ఒంట్లో శక్తిని నింపుకోవాలి. షూటింగుల్లో పాల్గొనాలి.. కమిట్‌మెంట్స్‌పూర్తి చేయాలి.. లేదంటే లైఫే రిస్కులో పడుతుంది.. ఇది తెలిసి ఆమె అభిమానులు చాలా బాధపడుతున్నారు.
అందుకే సమంత ఒకవైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు..వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తోంది.. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. మయోసైటిస్‌కు సంబంధించి నెలవారీ ఐవీఐజీ అంటే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీ సెషన్‌కు హాజరవుతున్నట్లు చెబుతోంది.. దీనికి సంబంధించి ఇన్‌స్టా స్టేటస్‌లో ఫొటోను షేర్ చేస్తూ న్యూ నార్మల్ అని చెప్పింది.. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను సమర్థంగా పనిచేయించడంతో పాటు, ఇతర వ్యాధుల కారణంగా ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది. దీని కోసం 2 నుంచి 4 గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చికిత్సను సమంత ఇంట్లోనే తీసుకుంటోంది. చికిత్స తీసుకుంటున్నా వ్యాయామాన్ని మాత్రం సామ్ నిర్లక్ష్యం చేయడం లేదు. ఐవిఐజి ట్రీట్‌మెంట్ చాలా ఖరీదైనది..10 గ్రాముల సీసా ధర సుమారు రూ.20,000. బరువును బట్టి – 12 గంటల్లో 2gm మోతాదులో శరీర బరువుకు సరిపడా ఐవిఐజి మెడిసిన్ ఇవ్వాలి..25 కిలోల బరువున్న పిల్లలకు 50gm IVIG అవసరం, ఇది రూ.1 లక్ష అవుతుంది. సమంత బరువు కనీసం 50 కిలోలనుకున్నా..రెండు లక్షలు ఖర్చవుతుంది.. సో.. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి.. ఒంట్లో సత్తువను కొంటోంది. అలాగని ఈ బలం ఎప్పుడూ ఉంటుందా అంటే..అస్సలుండదు.. లోపలున్న మయోసైటిస్..ఆమె బలాన్ని పీక్కు తింటోంది.. అందుకే.. ఎప్పటికప్పుడు ఆమె ఇమ్యూనిటీ కోసం ఇంట్లోనే చికిత్స తీసుకుంటోంది.. గతంలో కంటే ప్రస్తుతం కొంచెం కోలుకున్నట్లే కనిపిస్తున్నా.. ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోంది. అయినా పర్వాలేదు.. బాడీకి బూస్ట్ లేకపోతే..ఈ బేబీ హెల్త్ మరింత డేంజర్ జోన్‌లోకి వెళ్లడం ఖాయమంటున్నారు నిపుణులు. ఖర్చుతో కూడుకున్న చికిత్సే అయినా..ఇమ్యూనిటీని పెంచడటంలో దీన్ని మించిన ట్రీట్‌మెంట్ లేదంటున్నారు నిపుణులు.