Aamir Khan: బాలీవుడ్‌లో ఎక్కువవుతోన్న హెల్పింగ్ హ్యాండ్స్.. ఆమిర్ బ్యానర్‌లో ఆ స్టార్ హీరో సినిమా.?

వరుస ఫెయిల్యూర్స్‌ను అడ్డుకునేందుకు ఇండస్ట్రీ అంతా ఒక్క తాటి మీదకు వస్తోంది. ముఖ్యంగా ఇన్నాళ్లు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్న బాలీవుడ్ ఖాన్స్ కూడా ఇప్పుడు ఒకే తాటి మీదకు వచ్చారు.  

Aamir Khan: బాలీవుడ్‌లో ఎక్కువవుతోన్న హెల్పింగ్ హ్యాండ్స్.. ఆమిర్ బ్యానర్‌లో ఆ స్టార్ హీరో సినిమా.?
Aamir Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 13, 2023 | 8:43 AM

ఆ మధ్య బాలీవుడ్ ఖాన్స్ మధ్య పచ్చగడ్డేస్తే కూడా భగ్గుమంటుందన్న రేంజ్‌లో గ్యాప్‌ ఉండేది. యంగ్ ఏజ్‌లో కలిసి నటించిన హీరోలు కూడా మధ్యలో చాలా డిస్టన్స్ మెయిన్‌టైన్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఖాన్స్ ఖాన్‌దాన్‌ అంతా ఏకమై పోయింది. బాలీవుడ్ బ్యాడ్ ఫేజ్‌ భారీ నష్టాలు మిగిల్చినా.. ఓ విషయంలో మాత్రం ఇండస్ట్రీకి చాలా మంచి జరిగింది. వరుస ఫెయిల్యూర్స్‌ను అడ్డుకునేందుకు ఇండస్ట్రీ అంతా ఒక్క తాటి మీదకు వస్తోంది. ముఖ్యంగా ఇన్నాళ్లు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్న బాలీవుడ్ ఖాన్స్ కూడా ఇప్పుడు ఒకే తాటి మీదకు వచ్చారు.

కెరీర్‌ స్టార్టింగ్‌లో సల్మాన్ షారూఖ్‌ కలిసి నటించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. కానీ తరువాత ప్రఫెషనల్ అండ్ పర్సనల్ ఇష్యూస్‌ కారణంగా ఈ ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. దీంతో ఇద్దరూ కలిసి సినిమాలు చేయటం కాదు.. కనీసం కలిసి కనిపించటం కూడా మానేశారు. కానీ కొంత కాలంగా గ్యాప్‌ తగ్గుతూ వస్తోంది. ఒకరి సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్స్‌ చేస్తూ సపోర్ట్ చేసుకుంటున్నారు. గతంలో షారూఖ్ హీరోగా తెరకెక్కిన జీరో సినిమాలో సల్మాన్ స్పెషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు మరోసారి షారూఖ్‌ హీరోగా తెరకెక్కిన పఠాన్ సినిమాలో భాయ్‌జాన్‌ గెస్ట్ రోల్ చేశారు.

హెల్పింగ్ హ్యాండ్స్ లిస్ట్‌లోకి తాజాగా ఆమిర్‌ ఖాన్‌ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడూ ఇండస్ట్రీ జనాలకు దూరంగా ఉంటే ఆమిర్‌ ఖాన్‌ కూడా ఇప్పుడు ఖాన్స్ ఖాన్‌దాన్‌తో మింగిల్ అవుతున్నారు. వారితో కలిసి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తూ ఇండస్ట్రీలో పాజిటివ్‌ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు.

లాల్ సింగ్‌ చద్దా సెట్స్‌ మీద ఉండగానే ఓ స్పానిష్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు ఆమిర్‌ ఖాన్‌. కానీ లాల్‌ సింగ్‌ చద్దా ఫెయిల్ అవ్వటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు ఆమిర్‌… చాంపియన్స్ పేరుతో ప్లాన్ చేసిన ఈ సోర్ట్స్‌ డ్రామా తనకన్నా సల్మాన్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు.

గతంలో సుల్తాన్ లాంటి స్పోర్ట్స్‌ మూవీస్ చేసిన సల్మాన్‌, ఆమిర్ ప్రపోజల్ విషయంలో పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. ఆమిర్ బ్యానర్‌లో సల్మాన్ హీరోగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.