AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ‘రాయల్’గా ప్రభాస్.. డార్లింగ్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి..

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి మూవీకి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రావడం లేదు. అయితే అప్డేట్స్ మాత్రం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. మారుతి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమాకు ముందుగా రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడిచింది. ఇక ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది.

Prabhas: 'రాయల్'గా ప్రభాస్.. డార్లింగ్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2023 | 3:20 PM

Share

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదాలే నెలకొన్నాయి. ఇందులో రాముడిగా ప్రభాస్ నటన అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన విధానం.. పొరపాట్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఓవైపు సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి మూవీకి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రావడం లేదు. అయితే అప్డేట్స్ మాత్రం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. మారుతి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమాకు ముందుగా రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడిచింది. ఇక ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ రాయల్ అని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరును చిత్ర నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఇదే నిజం అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లుగా టైటిల్ అదిరిపోతుందని అంటున్నారు. గతంలోనూ రెబల్ పేరుతో సినిమా తీస్తే డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు మాత్రం రాయల్ పేరుతో రానున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తైందని తెలుస్తోంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై
పిల్లలు ఏదైన వస్తువు మింగితే వెంటనే ఏం చేయాలి..? ఈ విషయాలు తప్పక
పిల్లలు ఏదైన వస్తువు మింగితే వెంటనే ఏం చేయాలి..? ఈ విషయాలు తప్పక