AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై ప్రపంచం దృష్టి

రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గర్భస్థ పిండం గుండెకు ఇమ్యునోథెరపీ చికిత్సను విజయవంతంగా అందించింది. తల్లిలోని యాంటీబాడీల వల్ల గుండె బలహీనపడిన ఐదుగురు శిశువులకు ఈ అత్యాధునిక చికిత్సతో సకాలంలో చికిత్స అందించి, సుఖ ప్రసవం కలిగించి, ప్రాణాలను కాపాడారు. ఇది అరుదైన ప్రినేటల్ గుండె సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు గొప్ప ఆశను అందిస్తోంది.

వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై ప్రపంచం దృష్టి
Saves Unborn Baby Lives
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Feb 05, 2026 | 12:37 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆసుపత్రులకు మాత్రమే అందుబాటులో ఉన్న పిండం గుండెకు అత్యాధునిక చికిత్సను సకాలంలో అందించకపోతే పుట్టబోయే బిడ్డ గుండె పైన ప్రమాదకర పరిస్థితి ఏర్పడి ప్రాణాంతకం కావచ్చు. అయితే, చిల్డ్రన్ హాట్ ఇన్స్టిట్యూట్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గుండెకు ఇమ్యునో థెరపీ ద్వారా చికిత్స అందించి విజయం సాధించింది.

గతంలో గర్భం కోల్పోయిన ఒక 29 ఏళ్ల మహిళా గర్భాదారణతో ఆస్పత్రిలో చేరింది. ఆమె గత వైద్య చరిత్రను పరిశీలించిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్య సిబ్బంది అనేక వైద్య పరీక్షల అనంతరం పిండం చాల బలహీనంగా ఉన్నట్లు, గుండె స్పందనలు కూడా చాల తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. గుండె పంపింగ్ సరిగా లేదని గుర్తించారు. ఈ సమయంలో పిండానికి సరియైన చికిత్స అందించక పొతే గుండె ఫెయిల్ కావటం లేదా పిండం చనిపోవటం జరగవచ్చునని చెప్పారు. దాంతో తల్లిదండ్రుల అనుమతితో రెయిన్‌బోలోని మల్టీడిసిప్లినరీ వైద్య బృందం పిండం ఇమ్యునోథెరపీ చికిత్స ప్రారంభించి, అత్యాధునిక ఇమేజింగ్ వ్యవస్థ ద్వారా నేరుగా పిండానికి అత్యంత క్లిష్టమైన చికిత్సను ఒక వ్యూహాత్మకంగా అందించారు. ఈ చికిత్స అనంతరం పిండం గుండె పనితీరు అద్భుతంగా మెరుగుపడింది. గుండె కొట్టుకోవటం సాధారణ స్థితికి చేరింది. ఈ చికిత్స తర్వాత బాధిత మహిళకు డెలివరి, శిశువు సాధారణ గుండె చప్పుడు కలిగి వైద్య పరంగా ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

ప్రధానంగా తల్లిలోని స్జోగ్రెన్స్ సిండ్రోమ్ వ్యాధి, స్టోమెటిక్ లోపాజ్ ఎరితోమస్ వలన లేదా ఒకోసారి యాంటీ బాడీస్ వలన తల్లి నుండి గర్భస్థ పిండానికి అవి చేరటం వలన శిశువు గుండె పనితీరుకు తీవ్రమైన భంగం కలుగుతుందని వైద్యులు వెల్లడించారు.. తల్లిలో వీటిని గుర్తించటం అంత సులభంకాదన్నారు.. వీటి కారణంగా శిశువు కడుపులోనే చనిపోవటం సంభవిస్తుంటుంది. ఇలాటి కేసులను నిశితంగా పరిశీలించిన రెయిన్ బో వైద్య సిబ్బంది కొన్ని కారణాలను గుర్తించగలిగారు. ముందుగా తల్లిలోని యాంటీ బాడీస్ వంటి వాటిని గుర్తించి, తల్లి గర్భం లోని పిండానికి ఇమ్యునోథెరపీ ప్రక్రియ ద్వారా చికిత్స అందించటంలో విజయం సాదించారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు 21 నుంచి 27 వారాల మధ్య గర్భాదారణ కాలంలోని ఇలాటి 5 కేసులను గుర్తించి, ఇమ్యునోథెరపీ చికిత్స అందించటం ద్వారా శిశువును కాపాడ గలిగి, వారికి సుఖ ప్రసవం కలిగించటంలో విజయం సాధించారు. ఈ 5 కేసులలో అందించిన చికిత్స విధానాన్ని, పిండంలోని మార్పులను, మెరుగుదలను, అసాధారణంగా పెరిగిన ఉమ్మనీరు పరిష్కారాలను, గుండె పంపింగ్ పద్దతి ఏ విధంగా క్రమేణా మెరుగుపడి ఈ ఐదుగురు శిశువులు సజీవంగా ప్రసవించిన విధానం, వారందరూ వైద్య పరంగా ఎంతోరోగ్యంగా ఉన్నారనే అంశాలను JACC కేసు నివేదికలో ప్రచురించింది.

రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ ఈ సాంకేతిక నైపుణ్యం ద్వారా అనేక సంక్లిష్టమైన కేసులకు చికిత్స అందించటమే కాక శిశువుల సజీవ ప్రసవానికి మార్గదర్శకత్వం వహించటం, తదుపరి గుండె పనితీరుకు భరోసా అందిస్తున్నది.. అరుదైన, సంక్లిష్టమైన ప్రినేటల్ కార్డియాక్ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల వారికి ఆశాజనకంగా భరోసాను అందిస్తుంది రెయిన్‌బో.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
కార్ల వాడకం తగ్గించండి.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి!
కార్ల వాడకం తగ్గించండి.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి!
ఇరాన్‌ బిగ్‌ షాక్‌.. కొత్త మార్గం తెరిచిన సౌదీ!
ఇరాన్‌ బిగ్‌ షాక్‌.. కొత్త మార్గం తెరిచిన సౌదీ!
తగ్గుతున్న బంగారం ధరలు..! హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
తగ్గుతున్న బంగారం ధరలు..! హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
Horoscope Today: మెరుగ్గా ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి..
Horoscope Today: మెరుగ్గా ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి..
ప్రోటీన్ సప్లిమెంట్లు: శరీరానికి లాభమా, హానికరమా? నిజాలు తెలుసుకో
ప్రోటీన్ సప్లిమెంట్లు: శరీరానికి లాభమా, హానికరమా? నిజాలు తెలుసుకో
ఎంత బావుందో అని మీరు తెగ తింటున్నారు.. కానీ అసలు యవ్వారం ఇది..
ఎంత బావుందో అని మీరు తెగ తింటున్నారు.. కానీ అసలు యవ్వారం ఇది..
ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లో
ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లో
తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్...
తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్...
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరయ్యే సినీ ప్రముఖులు వీరే
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరయ్యే సినీ ప్రముఖులు వీరే
పాదాల్లో ఈ లక్షణాలున్నాయా?.. డయాబెటిస్‌ను ముందే కనిపెట్టేయండి
పాదాల్లో ఈ లక్షణాలున్నాయా?.. డయాబెటిస్‌ను ముందే కనిపెట్టేయండి