Emotional Farewell: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో అంతోటి నాగేశ్వరరావు కుటుంబం తమ పెంపుడు కుక్క లక్కీకి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించి తమ మమకారాన్ని చాటుకుంది. ఎనిమిదేళ్లుగా ఇంట్లో మనిషిలా పెంచుకున్న లక్కీ అనారోగ్యంతో మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.