Jalsa Movie: పద్నాలుగేళ్లైనా అదే పవర్.. జల్సా రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో జల్సా (Jalsa)కు ప్రత్యేక స్థానముంది. అక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయి మొదలు ఖుషి వరకు వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన వరుసగా ప్లాఫులు ఎదుర్కొన్నాడు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో జల్సా (Jalsa)కు ప్రత్యేక స్థానముంది. అక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయి మొదలు ఖుషి వరకు వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన వరుసగా ప్లాఫులు ఎదుర్కొన్నాడు. అయితే సినిమాల పరంగా ఆయన ఏ మాత్రం క్రేజ్ తగ్గలే. ఫ్యాన్స్ అందరూ ఒక్క హిట్ కావాలనుకుంటోన్న తరుణంలో జల్సాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ పలికిన సంభాషనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ల ఇలియానా, పార్వతి మెల్టన్‌ల అందం సినిమాకు మరింత గ్లామర్‌ను తీసుకొచ్చింది. 2008లోనే వెయ్యి స్క్రీన్‌లలో విడుదలైన మొదటి టాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించిన జల్సా మొదటి వారంలోనే 21 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇలా పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.
పవర్‌స్టార్ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 500 షోస్‌తో సెప్టెంబర్ 2న జల్సా రీ రిలీజ్ అవుతుంది. ఈక్రమంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగానే కట్ చేసిన ట్రైలర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. మహేశ్‌బాబు వాయిస్ ఓవర్‌తో ప్రారంభమై హీరో ఇంట్రెడెక్షన్, సాంగ్స్ క్లిప్పింగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కాగా ఇప్పటికే జల్సా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ పూర్తయ్యాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. కాగా కొన్ని చోట్ల తమ్ముడు సినిమా కూడా రీ రిలీజ్ అవుతుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
