Bheemla Nayak: అదిరిపోయే పోస్టర్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన “భీమ్లానాయక్”.. ఫ్యాన్స్‌కు పండగే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లానాయక్.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భీమ్లానాయక్ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న విషయం తెలిసిందే.

Bheemla Nayak: అదిరిపోయే పోస్టర్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన భీమ్లానాయక్.. ఫ్యాన్స్‌కు పండగే
Bheemla Nayak
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 16, 2021 | 11:27 AM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లానాయక్.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భీమ్లానాయక్ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడనున్నాయి. దాంతో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. తమ రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా కూడా వాయిదా పడనుందని వార్తలు పుట్టుకొచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కూడా ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని చూశారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా ఏప్రిల్‌కు షిఫ్ట్ అయ్యింది. దాంతో భీమ్లానాయక్ కూడా వెనక్కితగ్గిందని ప్రచారం జరిగింది. ఈ వార్తలు చిత్రయూనిట్ చెక్ పెట్టేసింది. తాజాగా రిలీజీ డేట్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అనుకున్న తేదీకే భీమ్లానాయక్ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది.Pawan

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sumanth: దూకుడు పెంచిన అక్కినేని హీరో.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సుమంత్..

Manushi Chhillar: మిస్‌ వరల్డ్‌ మొదటి సినిమా.. ఆకట్టుకుంటోన్న పృథ్వీరాజ్‌ టీజర్‌..

Srikanth: బడాహీరోకు భయపెట్టే పాత్ర ఇచ్చిన బోయపాటి.. జగ్గూభాయ్ బాటలో శ్రీకాంత్ కూడా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..