AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth: దూకుడు పెంచిన అక్కినేని హీరో.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సుమంత్..

మళ్ళీ రావా సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు అక్కినేని హీరో సుమంత్. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఎదురుచూస్తున్న సుమంత్ మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకున్నారు.

Sumanth: దూకుడు పెంచిన అక్కినేని హీరో.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సుమంత్..
Sumanth
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2021 | 10:43 AM

Share

Sumanth: మళ్ళీ రావా సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు అక్కినేని హీరో సుమంత్. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఎదురుచూస్తున్న సుమంత్ మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మళ్లీ మొదలైంది అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు ఈ యంగ్ హీరో. సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

సుమంత్ ఆర్జే క్యారెక్టర్‌లో కనిపించనున్న అహం రీబూట్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని చెబుతున్నాం అని దర్శకుడు ప్రశాంత్ సాగర్ చెప్పుకొచ్చారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. మరి ఈ సినిమా సుమంత్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.Sumanth

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీనా మజాకా.. “భోళా శంకర్‌” కోసం భారీ సెట్స్ వేయిస్తున్న మెహర్ రమేష్..?

Balakrishna: నెట్టింట్లో బాలయ్య అభిమానుల హంగామా.. అఖండ పై అదిరిపోయే మీమ్స్‌..

Raj Tarun: సెక్యూరిటీ గార్డుల కష్టం ఈ సినిమా వల్ల నాకు తెలిసొచ్చింది.. రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Follow Us
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
నేటి విద్యా వ్యవస్థలో పరీక్ష విద్యార్థికి కాదు.. ఉపాధ్యాయుడికే!
నేటి విద్యా వ్యవస్థలో పరీక్ష విద్యార్థికి కాదు.. ఉపాధ్యాయుడికే!
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!