Manushi Chhillar: మిస్‌ వరల్డ్‌ మొదటి సినిమా.. ఆకట్టుకుంటోన్న పృథ్వీరాజ్‌ టీజర్‌..

2017లో మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది మానుషి చిల్లర్‌. అందంతో పాటు తన అభినయ ప్రతిభను..

Manushi Chhillar: మిస్‌ వరల్డ్‌ మొదటి సినిమా.. ఆకట్టుకుంటోన్న పృథ్వీరాజ్‌ టీజర్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2021 | 10:16 AM

2017లో మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది మానుషి చిల్లర్‌. అందంతో పాటు తన అభినయ ప్రతిభను నిరూపించుకోవడానికి సినిమాల్లో కూడా అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. ఈనేపథ్యంలో మొదటి సినిమాలోనే ఏకంగా అక్షయ్‌కుమార్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం దక్కించుకుంది. హిందూస్థాన్ సింహంగా పేరు పొందిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘పృథ్వీరాజ్’ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తన మొదటి సినిమాకు సంబంధించిన టీజర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది మానుషి. ‘ అతను ప్రేమలో ఎంతో ధైర్యవంతుడు. యుద్ధంలో నిర్భయుడు. అతనే సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చైహాన్‌. వచ్చే ఏడాది అతను థియేటర్ల ద్వారా మీ ముందుకు రానున్నాడు’ అంటూ టీజర్‌ లింక్‌ను షేర్‌ చేసుకుంది. . ‘పృథ్వీరాజ్‌’ తర్వాత ఇదే బ్యానర్‌లో ‘ద గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ అనే మరో చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది మానుషి. విక్కీ కౌశల్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇక ‘బెల్‌ బాటమ్‌’, ‘సూర్యవంశీ’ వంటి సూపర్‌హిట్‌ సినిమాల తర్వాత అక్షయ్‌ నటిస్తోన్న చిత్రం ‘పృథ్వీరాజ్‌’. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సంజయ్‌దత్‌, సోనూసూద్‌, సాక్షి తన్వర్‌ లాంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.Also Read:

Thalapathy vijay: దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు .. తీరవెళ్లిచూస్తే..

Bollywood hot star Poonam Pandey: బాలీవుడ్‌ హాట్ స్టార్‌ను చితకబాదిన భర్త… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)

Srikanth: బడాహీరోకు భయపెట్టే పాత్ర ఇచ్చిన బోయపాటి.. జగ్గూభాయ్ బాటలో శ్రీకాంత్ కూడా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..