Thalapathy vijay: దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు .. తీరవెళ్లిచూస్తే..

సినీ ప్రముఖుల ఇళ్ల కు బాంబు బెదిరింపులు రావడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. ఇప్పటికే రజినీకాంత్, అజిత్ వంటి బడా హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

Thalapathy vijay: దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు .. తీరవెళ్లిచూస్తే..
Vijay
Follow us

|

Updated on: Nov 16, 2021 | 9:59 AM

Thalapathy vijay: సినీ ప్రముఖుల ఇళ్ల కు బాంబు బెదిరింపులు రావడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. ఇప్పటికే రజినీకాంత్, అజిత్ వంటి బడా హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజా దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విజయ్ ఇంట్లు బాంబు పెట్టమని ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. విజయ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెన్నై నగర పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో శనివారం అర్ధరాత్రి నీలాంగరైలోని ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. నీలాంగరై పోలీసులు బాంబు స్క్వాడ్‌ కలిసి ఇల్లంతా క్షుణంగా తనిఖీ చేశారు. చివరకు బాంబు లేదని తెలిసి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ ఫేక్ ఫోన్ కాల్ ఎవరు చేశారన్నదని పై పోలీసులు ద్రుష్టి పెట్టారు. పోలీసుల దర్యాప్తులో విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి చెందిన భువనేశ్వర్‌ అనే యువకుడిని పోలీసులు గుర్తించారు. అతడు ఓ  మనస్థిమితంలేని యువకుడు అని తెలుసుకున్నారు పోలీసులు. అతడే  పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసినట్లు నిర్ధారించుకున్నారు. అతను గతంలో కూడా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లల్లో బాంబు ఉన్నట్లు ఫోన్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీనా మజాకా.. “భోళా శంకర్‌” కోసం భారీ సెట్స్ వేయిస్తున్న మెహర్ రమేష్..?

Balakrishna: నెట్టింట్లో బాలయ్య అభిమానుల హంగామా.. అఖండ పై అదిరిపోయే మీమ్స్‌..

Raj Tarun: సెక్యూరిటీ గార్డుల కష్టం ఈ సినిమా వల్ల నాకు తెలిసొచ్చింది.. రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.