Bigg Boss 5 Telugu: దశ మార్చిన బిగ్‌బాస్.. ఏకంగా చెర్రీ-శంకర్‌ల చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఇద్దరు కంటెస్టెంట్లు.?
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడో హాలీవుడ్‌లో మొదలైన బిగ్‌బాస్ రియాలిటీ షో, తెలుగు వరకు వచ్చిందంటే ఈ షోకి...

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడో హాలీవుడ్‌లో మొదలైన బిగ్‌బాస్ రియాలిటీ షో, తెలుగు వరకు వచ్చిందంటే ఈ షోకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సీజన్ సీజన్‌కి అభిమానులను పెంచుకుంటూ పోతోన్న బిగ్‌బాస్‌షో తెలుగులో విజయవంతంగా 5వ సీజన్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు ఎంతలా వినోదాన్ని పంచుతుందో.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లకు అదే స్థాయిలో కలిసొస్తుంది. బిగ్‌బాస్‌లో పాల్గొని బయటకు వచ్చిన వారిలో చాలా మంది సినిమాల్లో నటించే ఛాన్స్‌లు దక్కించుకున్నారు.
బిగ్‌బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో వరుస సినిమాలు చేస్తున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం బిగ్‌బాస్ 5వ సీజన్‌లో పాల్గొన్న ఇద్దరు లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు విశ్వ అయితే మరొకరు లొబో. వీరిద్దరికీ రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో లోబో, విశ్వలు నటించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ చెర్రీతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తకు బలం చేకూరినట్లైంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Atm Dhagdham: ఏటీఎంలో మంటలు..బూడిదైన నోట్ల కట్టలు..! ఎవరు చేసారో సీసీ కెమెరాలో రికార్డు..(వీడియో)
KL Rahul: ద్రవిడ్‌తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను.. వైస్ కెప్టెన్సీ ఒక బాధ్యత..