Kushi Box Office collections: పవర్ స్టారా మజాకా.. వారం రోజుల్లో ఖుషి సినిమా ఎంత వసూల్ చేసిందంటే..
ఎస్జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. 2001లో వచ్చిన ఈ మూవీ ఒక సంచలనాన్ని సృష్టించింది. పవన్ నటన, యాటిట్యూడ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించన ఖుషి మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమా తర్వాత పవన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఎస్జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. 2001లో వచ్చిన ఈ మూవీ ఒక సంచలనాన్ని సృష్టించింది. పవన్ నటన, యాటిట్యూడ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా ఖుషి సినిమాను తాజాగా రీరిలీజ్ చేశారు. ఖుషి సినిమా రిలీజ్ అయిన 22 ఏళ్ల తర్వాత ఖుషి సినిమాను రీరిలీజ్ చేశారు. న్యూ ఇయర్ కానుకగా పలు థియేటర్స్ లో ఖుషి సినిమా రీరిలీజ్ అయ్యింది.
ఇక ఈ సినిమాకు రీరిలీజ్ లోనూ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొత్త సినిమా రిలీజ్ కు చేసినంత హడావిడి చేశారు ఫ్యాన్స్. థియేటర్స్ దద్ధరిల్లాయి. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. మొత్తంగా ఖుషి సినిమాను మరోసారి రికార్డులు క్రియేట్ చెశాలా చేశారు. ఈ సినిమాకు పవన్ ఫ్యాన్స్ మరోసారి బ్రహ్మరథం పట్టారు. ఖుషి సినిమా రీరిలీజ్ అయిన థియేటర్స్ లో రికార్డులు బద్దలు కొట్టింది. ముందుగా ఒక్క రోజే అనుకున్నారు. కానీ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఈ సినిమాను మరికొన్ని రోజులు పొడిగించారు .
నైజాం 1.72 కోట్లు, సీడెడ్ 0.51 కోట్లు, ఆంధ్ర 1.79 కోట్లు, ఏపీ , తెలంగాణకలిపి 4.02 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42 కోట్లు,ఓవర్సీస్ 0.21 కోట్లు, మొత్తంగా వరల్డ్ వైడ్ 4.65 కోట్లు వసూల్ చేసింది ఖుషి. రీ రిలీజ్ లో ‘ఖుషి’ ఏకంగా రూ.4.65 కోట్ల షేర్ ను రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.



