Tollywood : ఈ ఫొటోలో కనిపిస్తున్న క్లాసికల్ డాన్సర్ ఎవరో తెలుసా..? టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సతీమణి ఆమె..

పై ఫొటోలో కనిపిస్తున్న క్లాసికల్ డాన్సర్ గురించి కూడా ఎక్కువ మందికి తెలిసుండక పోవచ్చు. ఆమె టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సతీమణి ఆవిడా.. క్లాసిక్ డాన్స్ లో ఆరితేరిన నాట్య మయూరి ఆమె ఇంతకు ఆమె ఎవరో..?

Tollywood : ఈ ఫొటోలో కనిపిస్తున్న క్లాసికల్ డాన్సర్ ఎవరో తెలుసా..? టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సతీమణి ఆమె..
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2023 | 5:11 PM

కొంతమంది సినీ ప్రముఖులు తమ ఫ్యామిలీని మీడియా ముందుకు తీసుకురావడానికి పెద్దగా ఇష్టపడరు. ఇప్పటికీ కొంతమంది హీరోల భార్యల గురించి, ఫ్యామిలీ గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. పై ఫొటోలో కనిపిస్తున్న క్లాసికల్ డాన్సర్ గురించి కూడా ఎక్కువ మందికి తెలిసుండక పోవచ్చు. ఆమె టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సతీమణి ఆవిడా.. క్లాసిక్ డాన్స్ లో ఆరితేరిన నాట్య మయూరి ఆమె ఇంతకు ఆమె ఎవరో..? ఆ దర్శకుడెవరో కనిపెట్టారా.? ఈ క్లాసిక్ డాన్సర్ భర్త టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన కోసం అగ్ర హీరోలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతకు ఆయన ఎవరంటే..

టాలీవుడ్ లో స్టార్ దర్శకుల పేర్లు లిస్ట్ తీస్తే ఆ అందులో ముందు ఉండే పేర్లలో త్రివిక్రమ్ పేరు ఒకటి. తెలుగులో త్రివిక్రమ్ సినిమాలకు ఒక బ్రాండ్ ఉంది. రైటర్ గా పరిచయం అయ్యి.. ఆతర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి.. ఆ తర్వాత దర్శకుడు అయ్యారు త్రివిక్రమ్.

ఇవి కూడా చదవండి

పై ఫొటోలో ఉన్న క్లాసిక్ డాన్సర్ త్రివిక్రమ్ సతీమణి సౌజన్య శ్రీనివాస్. ఆమె ఎవరో కాదు ప్రముఖ సినీ గేయరచయిత, కవి  ప‌ద్మ‌ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోద‌రుడి కూతురు. అందుకే సిరివెన్నెల అంటే త్రివిక్రమ్‌కు అంతటి అభిమానం. సౌజన్య ఒక నాట్య కళాకారిణి. ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తాజాగా క్లాసికల్ డాన్స్ గురువు పసుమర్తి రామలింగయ్య శాస్త్రి గారి అధ్యక్షతన సౌజన్య భామా కలాపం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రం శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. Trivikram, SoujanyaTrivikram, Soujanya