Waltair Veerayya: విశాఖలో వాల్తేరు వీరయ్య ఈవెంట్.. ఈ జనాన్ని చూశారా.. ఇది మెగా ఫ్యాన్స్ అంటే (లైవ్)
ప్రిరిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రయూనివర్సిటీ ముస్తాబవుతుంది. ఇప్పటికే ఈవింట్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ వేడుకకు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు విశాఖ పోలీసులు.
మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యా సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికాగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య ప్రీ రీలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ప్రీరిలీజ్ వేదిక మారింది. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.ఇప్పటికీ మూడు సార్లు వాల్తేరు వీరయ్య వేదిక మారింది. మొదట ఆర్కే బీచ్.. తర్వాత ఏయూ.. మళ్లీ ఆర్కేబీచ్ అని అన్నారు. తాజాగా ఏయూలోనే ఫైనల్ చేశారు విశాఖ పోలీసులు. అయితే ఉదయం నుంచి ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు వాల్తేర్ వీరయ్య యూనిట్. ఇప్పుడు సీపీ ఆదేశాలతో మళ్లీ ఏయూలో ఏర్పాట్లు మొదలు పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

