RGV: పవన్‌, బాబు భేటీపై ఇన్‌ డైరెక్ట్‌గా స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ… ‘కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేతలపై వైసీపీ విధించిన నిబంధనలపై వీరిద్దరూ చర్చించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా..

RGV: పవన్‌, బాబు భేటీపై ఇన్‌ డైరెక్ట్‌గా స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ... 'కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు' అంటూ..
Rgv
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 09, 2023 | 9:39 AM

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేతలపై వైసీపీ విధించిన నిబంధనలపై వీరిద్దరూ చర్చించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. వీరి మీటింగ్‌పై వైసీపీ నాయకులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. పవన్‌, చంద్రబాల భేటీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని టీడీపీ రక్షణ కోసం అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో ఈ అంశం కాస్త పొలిటికల్‌ హీట్‌ను పెంచేసింది.

ఇదిలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై తనదైన కామెంట్స్‌ చేస్తూ వస్తోన్న సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. చంద్రబాబు, పవన్‌ల మీటింగ్‌పై కూడా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా తనదైన శైలిలో పంచ్‌ ఇచ్చారు. అయితే ఎక్కడ చంద్రబాబు, పవన్‌ మీటింగ్ విషయాన్ని నేరుగా ప్రస్తావించని రామ్‌గోపాల్‌ వర్మ విషయాన్ని మాత్రం చెప్పకనే చెప్పేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్ చేస్తూ.. ‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని , కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు .. RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు ‘ అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ వర్మ ఎక్కడా బాబు, పవన్‌ల పేరును ప్రస్తావించకపోయినప్పటికీ.. నెటిజన్లకు మాత్రం అసలు విషయం ఏంటో స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి

దీంతో ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. వర్మ చేసిన ట్వీట్‌కు కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం నెగిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తానెప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించనని చెప్పే వర్మ.. ఇటీవల మాత్రం ఏపీ రాజకీయాల విషయంలో కాస్త ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా టికెట్ల వ్యవహారం నుంచి, మొన్నటి మొన్న ఏపీ రాజకీయాల నేపథ్యంతో ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..