kalyanam kamaneeyam: సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి ఈ చిన్న సినిమా సక్సెస్ అయ్యేనా.?

ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ కుర్ర హీరో. సంతోష్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది.

kalyanam kamaneeyam: సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి ఈ చిన్న సినిమా సక్సెస్ అయ్యేనా.?
Kalyanam Kamaneeyam
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 09, 2023 | 9:24 AM

యంగ్ హీరో సంతోష్ శోభన్ కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సంతోష్.. ఆతర్వాత హీరోగా మరి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పేపర్ బాయ్, అన్ని మంచి రోజులే, ఏ మినీ కథ లాంటి హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ కుర్ర హీరో. సంతోష్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేశారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే కాన్సెప్ట్ తో రూపొందడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సకుటుంబంగా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేసే మూవీ అనే అభిప్రాయం వారిలో ఏర్పడుతోంది. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!