Pawan Kalyan Birthday: ఒక రోజు ముందే సర్‌ప్రైజ్ చేసిన భీమ్లా నాయక్ టీమ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్ చంద్ర డైరెక్షన్లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
Pawan Kalyanఫ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్ చంద్ర డైరెక్షన్లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తెరకెక్కుతున్న ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆ తరువాత ఈ సినిమాలోని పవన్, రానా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక ఈ అంచనాలను క్యారీ చేస్తూ.. నిన్న కాక మొన్ననే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ను యూట్యూబ్ దద్దరిల్లేలా రీసౌండ్ చేసింది. అభిమానుల్లో ఎక్కడలేని జోష్ ను నింపింది
“డానీ బయటకు రారా… ” అంటూ ఫస్ట్ గ్లిమ్స్‌లో లుంగి పైకి కట్టుకుని ఆవేశంగా నడివస్తున్న పవన్ కళ్యాణ్‌ని చూసిన అభిమానులు ఊగిపోయారు. నెట్టింట భీమ్లా నాయక్‌ను టాప్‌లో నిలబెడుతూ …. రిలీజైన గంటలోనే ట్రెండింగ్‌లో నిలిపారు. భీమ్లా నాయక్… వస్తున్నాడు అంటూ లేటెస్ట్ గా రిలీజైన గ్లిప్స్ మత్తులో నుంచి పవన్ ఫ్యాన్స్ బయటకు రాలేకపోతున్నారు. ఇందులో పవన్ గెస్చర్స్ చూసినవాళ్లు ఏదో ఫ్రెష్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ షర్టులో లుంగీ పైకి కట్టుకుని ఆవేశంగా నడిచొచ్చే తీరుని.. పవర్ ఫుల్ డైలాగులను చెప్పే సీన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు అందులోనూ పవర్ బీజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన థమన్ ఫస్ట్ గ్లింప్ల్స్‌లో మ్యూజిక్ దద్దరిల్లేలా కొట్టడంతో … భీమ్లా నాయక్ అందర్నీ సాటివ్ ఫై చేశాడు. సాటిస్ ఫై చేయడమే కాదు.. ఈ సినిమాలో ఇంకేదో ఉందనేఆసక్తిని అందరికీ కలిగించాడు. తాజాగా పవన్ పుట్టిన రోజు కానుకగా భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే దానికంటే ముందే ఈ సాంగ్ లిరికల్ షీట్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అందించగా.. థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ లిరికల్ షీట్‌తోపాటు పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :