Hari Hara Veera Mallu: 3 లుక్స్, 30 గెటప్స్… పవన్ కోసం బిగ్ ప్లాన్.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న క్రిష్
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఫోక్‌లోర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్.
Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఫోక్‌లోర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్… రాబిన్‌హుడ్ తరహా బందిపోటు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారట. లుక్స్ విషయంలోనే కాదు కాస్ట్యూమ్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. పీరియాడిక్ ఫీల్ వచ్చేలా 30 వెరైటీ డ్రెసెస్ డిజైన్ చేయించారట. సినిమా మొత్తంలో పవన్ ఆ 30 కాస్ట్యూమ్స్‌లోనే కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టీజర్లో రిలీజ్ అయిన లుక్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. మిగతా గెటప్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయన్న హింట్ ఇస్తున్నారు మేకర్స్ .
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ కోసం పవన్ కూడా చాలా కష్టపడుతున్నారు. కత్తి యుద్దం, కర్రసాములో ట్రైనింగ్ తీసుకున్నారు. వారియర్ తరహా ఫిజిక్ కోసం జిమ్‌లో వర్క్ అవుట్ చేసి ఫిట్‌గా రెడీ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి