AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: ‘డబుల్ కా మీఠా… ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే సీన్స్ గ్యారంటీ.. కొర‌టాల‌ శిబిరం హామి

అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికి ఆచార్య సినిమా రిలీజై సెకండ్ వీక్ రన్నింగ్ లో ఉండేది. మెగా ఫాన్స్ మనసుల్లో బ్రేక్ డాన్స్ కనిపించేది. కానీ. కరోనా వచ్చి కథ కాస్త టర్నింగ్ ఇచ్చుకుంది.....

Acharya:  'డబుల్ కా మీఠా... ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే సీన్స్ గ్యారంటీ.. కొర‌టాల‌ శిబిరం హామి
Acharya Movie Update
Ram Naramaneni
|

Updated on: May 25, 2021 | 7:28 PM

Share

అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికి ఆచార్య సినిమా రిలీజై సెకండ్ వీక్ రన్నింగ్ లో ఉండేది. మెగా ఫాన్స్ మనసుల్లో బ్రేక్ డాన్స్ కనిపించేది. కానీ. కరోనా వచ్చి కథ కాస్త టర్నింగ్ ఇచ్చుకుంది. అయితేనేం.. లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అనే రేంజ్ లో ఆచార్య కంటెంట్ మీద ఎస్టిమేషన్స్ పెరిగిపోతున్నాయి. కొరటాల మార్క్ విక్టరీ గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మెగాస్టార్ రీఎంట్రీ మూవీతోనే చిరూ-కాజల్ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందో చూసేశారు తెలుగు ఆడియెన్స్. ఇప్పుడు ఆచార్యతో ఆ జోడీని రిపీట్ చేస్తూ.. ‘లెటజ్ ఎక్స్ పెక్ట్ మోర్ అండ్ మోర్’ అని ఊరిస్తున్నారు డైరెక్టర్ కొరటాల. టీజర్ తర్వాతొచ్చిన మొదటి పాట తాలూకు సౌండ్ ఇంకా తగ్గనేలేదు. లెటజ్ వెయిట్ ఫర్ సెకండ్ సాంగ్ అంటోంది ఆచార్య టీమ్. రేపటిరోజున రాబోయే పాట చరణ్-పూజ హెగ్డేల మీద షూట్ చేసిందనేది ఒక గెస్.

కథ మీద పట్టు సడలకుండా పాత్రల్ని ఎంత పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తారో కొరటాల సినిమాల్ని ఫాలో అయ్యేవాళ్ళకు బాగా తెలుసు. ఇప్పుడు చిరూ అండ్ చరణ్ పాత్రల విషయంలో కూడా అంతే క్లారిటీతో వున్నారు ఈ స్టార్ కెప్టెన్. ఆచార్యకి 75 శాతం, సిద్ధ పాత్రకు 25 శాతం స్క్రీన్ స్పేస్ ఉంటుందని రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిఫై చేశారు. ఇంటర్వెల్ తర్వాత చెర్రీ మీద ఫోకస్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిరూ-చెర్రీ కంబైన్డ్ షాట్స్ అభిమానులకు ‘డబుల్ కా మీఠా’ ఫీలింగ్ నిస్తాయట.

గతంలో మెగాస్టార్ అండ్ మెగాపవర్ స్టార్ కలిసి ఎన్నిసార్లు కనిపించినా.. అవన్నీ ఒక ఎత్తు.. ఆచార్య కాంబినేషన్ ఒక్కటీ ఒక ఎత్తు అనేది కొరటాల ఇస్తున్న గ్యారంటీ. తాను రాసిన సిద్ధుడి పాత్రతో చిరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారని.. అందుకే పట్టుపట్టి దాన్ని చరణ్ తోనే చేయిస్తున్నారని చెప్పారు కొరటాల. మెగాస్టార్ ఆ రేంజ్ లో హోప్స్ పెట్టుకుని అమితంగా ఇష్టపడి చేస్తున్నారు కనుకే… ఆచార్య మూవీ అవుట్ ఫుట్ విషయంలో ఏమాత్రం రాజీ పడ్డం లేదు మేకర్స్. మణిశర్మ కూడా ఫస్ట్ సాంగ్ తోనే ‘ఐయామ్ బ్యాక్’ అనే స్థాయిలో మ్యూజిక్ ఇచ్చారు. సో.. కొరటాల చేస్తున్న బ్లాక్ బస్టర్ల దండయాత్ర… ఆచార్యతో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ మెండుగానే కనిపిస్తున్నాయ్.

Also Read: తెలుగునాట ట్రెండింగ్‌గా మారిన ర‌ణ‌బీర్, ఆలియా.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి

ఆనంద‌య్య నాటు మందుపై న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క వ్యాఖ్య‌లు..

Follow Us