Tollywood: తెలుగునాట ట్రెండింగ్‌గా మారిన ర‌ణ‌బీర్, ఆలియా.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి

బాలీవుడ్ లో స్టార్ కపుల్ గా పేరున్న ఒక జంట.. ఇప్పుడు సీరియస్ గా టాలీవుడ్ వైపు ఓరకంట చూస్తోంది. తెలుగు భాష, తెలుగు సినిమాల మీదే ఇప్పుడు వాళ్ళిద్దరి ధ్యాస.

Tollywood:  తెలుగునాట ట్రెండింగ్‌గా మారిన ర‌ణ‌బీర్, ఆలియా.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి
Ranbir Alia
Follow us
Ram Naramaneni

|

Updated on: May 25, 2021 | 7:17 PM

బాలీవుడ్ లో స్టార్ కపుల్ గా పేరున్న ఒక జంట.. ఇప్పుడు సీరియస్ గా టాలీవుడ్ వైపు ఓరకంట చూస్తోంది. తెలుగు భాష, తెలుగు సినిమాల మీదే ఇప్పుడు వాళ్ళిద్దరి ధ్యాస. ఇక్కడి స్టార్ డమ్ మీద స్పెషల్ గా సిట్టింగ్ వేసి.. ఎనలైజ్ చేస్తున్నారా అనిపిస్తుంది ఆ బ్యూటిఫుల్ కపుల్ ని చూస్తే. ఇంతకీ వాళ్లెవరు? సడన్ గా తెలుగు మీద వాళ్ళకెందుకు మమకారం పెరిగినట్టు? తెలుసుకుందాం ప‌దండి

టాలీవుడ్ లో పీక్ స్టేజ్ ని ఎంజాయ్ చేసిన సమంత.. ఇక బాలీవుడ్ వైపు చూస్తారన్నది నిన్నటి వార్త. హిందీలో చేస్తేగీస్తే రణబీర్ కపూర్ తోనే చేస్తా.. అది నా గోల్డెన్ డ్రీమ్ అనేది సమంత ఇప్పుడు చెబుతున్న మాట. ఫ్యామిలీ మేన్ ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో సామ్ చెప్పిన ఈ మేటర్.. ఇప్పుడు బీటౌన్లో కూడా రీసౌండ్ ఇస్తోంది. ఇప్పటికే నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్న ఈ రామలక్ష్మి.. ఇప్పుడీ చాకోలెట్ బాయ్ మీద ఫోకస్ పెట్టడం బిగ్ న్యూస్ కాకుండా ఎందుకుంటుంది చెప్పండి? ఇంతకీ… ఆ రణబీరుడి మనసులో ఏమున్నట్టు?

బాహుబలి చూశాక దేవసేన మాయలో పడిపోయా అని.. గతంలో మన బొమ్మాళి అనుష్క మీద తనకుండే క్రష్ ని బైటపెట్టేశారు రణబీర్ కపూర్. టైం కలిసొస్తే మీ స్వీటీతో నేనూ ఒక సినిమా చేస్తా అని మనసులో మాట చెప్పుకున్నారు. రేపటిరోజున అనుష్క బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. ఆ డెబ్యూ ఛాన్స్ రణబీర్ కి దక్కినా దక్కొచ్చట. అదీ.. సౌత్ హీరోయిన్లకు ఆ కపూర్ గారబ్బాయి మీదుండే స్పెషల్ ఫోకస్. బర్ఫీ బాయ్ మేటర్ ఇలా ఉంటే.. ఆయన గాళ్ ఫ్రెండ్ ఆలియా మనసు మాత్రం సౌత్ హీరోల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ట్రిపులార్లో చరణ్ కి జోడీగా సీత కేరెక్టర్ చేస్తున్నారు అలియా. అది చాలదన్నట్టు.. చెర్రీతోనే శంకర్ డైరెక్ట్ చేయబోయే మూవీక్కూడా గల్లీ బాయ్ బ్యూటీ సంతకం చేసినట్టు వార్తలొస్తున్నాయి. కష్టపడి తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెబుతున్నారు. ఇప్పుడు తాను నేర్చుకున్న ఆ తెలుగును తన ఫియాన్సీ రణబీర్ కి నేర్పించే రోజులు కూడా వస్తాయేమో…! చూడాలి మరి.

Also Read:ఆనంద‌య్య నాటు మందుపై న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క వ్యాఖ్య‌లు..

స‌హ‌జ న‌ట‌న‌.. క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యం.. కార్తీ సొంతం. నేడు ఆయ‌న పుట్టిన రోజు.. ఈ సంద‌ర్భంగా..