Rao Ramesh First Look: మ‌హా స‌ముద్రంలో గూని బాబ్జీ.. ఆక‌ట్టుకుంటోన్న రావు ర‌మేశ్ ఫ‌స్ట్ లుక్‌..

Rao Ramesh First Look: ఆర్ఎక్స్‌100 సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నారు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఒక్క సినిమాతోనే మంచి ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఇక మొద‌టి సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అజ‌య్ భూప‌తి..

Rao Ramesh First Look: మ‌హా స‌ముద్రంలో గూని బాబ్జీ.. ఆక‌ట్టుకుంటోన్న రావు ర‌మేశ్ ఫ‌స్ట్ లుక్‌..
Rao Ramesh
Follow us
Narender Vaitla

|

Updated on: May 25, 2021 | 7:40 PM

Rao Ramesh First Look: ఆర్ఎక్స్‌100 సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నారు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఒక్క సినిమాతోనే మంచి ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఇక మొద‌టి సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అజ‌య్ భూప‌తి రెండో చిత్రంకు చాలా గ్యాప్ తీసుకున్నారు. అజ‌య్ త‌న రెండో చిత్రంగా మ‌హా స‌ముద్రంను తెర‌కెక్కించే ప‌నిలో పడ్డారు. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అదితి రావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేశ్ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం రావు ర‌మేశ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో రావు ర‌మేశ్ గూని బాబ్జీగా క‌నిపించ‌నున్నారు. ఇక ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే రావు రమేశ్ పాత్ర విల‌క్ష‌ణ‌తో కూడిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సినిమాలో రావు ర‌మేశ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పాత్ర విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తోన్న అజ‌య్ భూప‌తి మ‌హాస‌ముద్రంతో ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటాడో చూడాలి.

మ‌హా స‌ముద్రంలో రావు ర‌మేశ్ పాత్ర‌..

Also Read: Unique Health ID: కరోనా టీకా సర్టిఫికేట్ లో కనిపిస్తున్న ప్రత్యేక హెల్త్ఐడీ.. ఇది ఏమిటి? దీనివలన ఉపయోగం ఏమిటి?

Acharya: ‘డబుల్ కా మీఠా… ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే సీన్స్ గ్యారంటీ.. కొర‌టాల‌ శిబిరం హామి

Tollywood: తెలుగునాట ట్రెండింగ్‌గా మారిన ర‌ణ‌బీర్, ఆలియా.. ఎందుకో తెలుసుకుందాం ప‌దండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!