Unique Health ID: కరోనా టీకా సర్టిఫికేట్ లో కనిపిస్తున్న ప్రత్యేక హెల్త్ఐడీ.. ఇది ఏమిటి? దీనివలన ఉపయోగం ఏమిటి?

Unique Health ID: కరోనా వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోగలిగేది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. దీనికోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేసుకుంటూ వస్తోంది.

Unique Health ID: కరోనా టీకా సర్టిఫికేట్ లో కనిపిస్తున్న ప్రత్యేక హెల్త్ఐడీ.. ఇది ఏమిటి? దీనివలన ఉపయోగం ఏమిటి?
Unique Health Id
Follow us
KVD Varma

|

Updated on: May 25, 2021 | 7:31 PM

Unique Health ID: కరోనా వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోగలిగేది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. దీనికోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేసుకుంటూ వస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం కోవిడ్ -19 కు ఇప్పటివరకు దాదాపు 20 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేశారు. మహమ్మారి గత సంవత్సరం ప్రారంభమైన తరువాత రెండవ సారి వ్యాధి తీవ్రత ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. ఇక కోవిడ్ టీకాలను క్రమంగా అందరికీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టీకాలు తీసుకున్న వారికి టీకా తీసుకున్నట్టు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ లో టీకా తీసుకున్న వ్యక్తికి సంబంధించి అన్నివివరాలు నమోదు చేస్తున్నారు. అయితే, ఈ సర్టిఫికేట్ లో ప్రత్యేకంగా ఒక ఆరోగ్య ఐడీ (యుహెచ్ఐడీ) ఇస్తున్నారు. చాలామంది దీనిని ఒక క్రమ సంఖ్యగా భావిస్తున్నారు. కానీ, దీనిలో ఉన్న ప్రయోజనాలు.. భారత ప్రభుత్వం ఎందుకు ఇటువంటి సంఖ్యను ఇస్తోంది అనేవిషయం ఎవరికీ తెలీదు. అదేవిధంగా కొంతమంది ఈ ఐడీ చూసి కంగారు పడుతున్నారు. అసలు ఈ ఐడీ ఏమిటి? ఎందుకు ఇస్తున్నారు? దీనివలన ప్రత్యేకంగా ప్రయోజనం ఏదైనా ఉందా వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ యూహెచ్ఐడీ ఏమీ కొత్త ప్రతిపాదన కాదు. భారత ప్రభుత్వం ఇంతకు ముందు అనేకసార్లు దీని గురించి వివరించింది. ప్రభుత్వం ప్రకారం హెల్త్ ఐడి అంటే ఏమిటో తెలుసుకుందాం. భారత ప్రభుత్వం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్‌డిహెచ్‌ఎం) కార్యక్రమంలో భాగంగా ఈ హెల్త్ ఐడి వస్తుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాల సదుపాయాలను మరింత పెంచడం ఎన్‌డిహెచ్‌ఎం లక్ష్యంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది భారతదేశంలో ఆరోగ్య సంరక్షణను డిజిటలైజ్ చేసే దశ.

ఎన్‌డిహెచ్‌ఎం పనిచేయడానికి, దేశంలోని ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నిటిలోనూ డిజిటల్ వ్యవస్థలను ఉపయోగించుకోవాలనేది ప్రణాళిక. ఈ వ్యవస్థలు సమిష్టిగా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కార్మికులు, ఆరోగ్య రికార్డులు, రోగులు, వారి వైద్య చరిత్రలను కవర్ చేస్తాయి. ఆరోగ్య ఐడీ ఎన్‌డిహెచ్‌ఎం ను ప్రారంభించడానికి కీలక వ్యవస్థ. ఎన్‌డిహెచ్‌ఎం వెబ్‌సైట్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం, ఆరోగ్యఐడీలు “ఆరోగ్య సంరక్షణ ప్రదాతలలో ఒక వ్యక్తిని గుర్తించే ప్రక్రియను ప్రామాణీకరించడానికి” సహాయపడతాయి. సృష్టించిన వైద్య రికార్డులు “సరైన వ్యక్తికి జారీ చేయబడతాయి లేదా తగిన సమ్మతి ద్వారా ఆరోగ్య సమాచార వినియోగదారుకు అందచేస్తాయి.” అని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.

ఒకసారి ఈ ఐడీ క్రియేట్ అయిన తర్వాత, ఈ హెల్త్ ఐడీలు “వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించడం, వారిని ప్రామాణీకరించడం అలాగే, వారి ఆరోగ్య రికార్డులను (రోగి యొక్క సమాచార సమ్మతితో మాత్రమే) బహుళ వ్యవస్థలు అనుసంధానించడం కోసం ఉపయోగిస్తారని వెబ్‌సైట్ స్పష్టంగా సూచిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్ని ప్రదేశాల నుండి, ఆరోగ్య సదుపాయాల నుండి ఆరోగ్య ఐడిలు అందరు వ్యక్తుల ఆరోగ్య రికార్డులకు ప్రధానమైనవి.

ప్రస్తుతం ఇది ట్రయిల్ దశలా కనిపిస్తున్నా.. కోవిడ్ వ్యాక్సిన్ కచ్చితంగా అందరూ తీసుకునే అవకాశం ఉన్నందున భవిష్యత్ లో ఈ హెల్త్ ఐడీ ప్రజల ఆరోగ్య పరిస్థితులను డిజిటలైజ్ చేయడానికి ఉపయోగపడొచ్చు. ఇప్పటివరకూ దీనిపై స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాకపోయినా.. ఈ యూనిక్ హెల్త్ఐడీ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. దీనిని ఉపయోగించుకుని మారుమూలలో ఉన్న ప్రజల ఆరోగ్య పరిస్థితిని డిజిటల్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తుల ఆరోగ్యపరమైన విషయాలను ఈ ఐడీని ఉపయోగించుకుని రికార్డు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివలన దేశంలో లేదా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా.. ప్రజలు తమ పాత హెల్త్ రికార్డులను కూడా మోసుకుని వెళ్ళక్కర్లేదు. ఈ ఐడీ ద్వారా డిజిటల్ గా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: Workouts after Corona: కరోనా నుంచి కోలుకున్నాకా.. ఎన్నిరోజుల తరువాత వ్యాయామాలు చేయొచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారు?

Blood Thinners: కరోనా పేషెంట్స్ అందరికీ రక్తం గడ్డ కడుతుందా? డాక్టర్లు రక్తం పలుచబడే మందులు ఎందుకు వాడాలంటున్నారు?