Allu Arjun- Posani: అల్లు అర్జున్‌ మంచి మిత్రుడు.. ఆరోజు నాకు 5 లక్షలిచ్చి ఏమన్నాడంటే? పోసాని

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 69 ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ సినిమా అవార్డుల్లో మొదటి సారిగా ఒక తెలుగు యాక్టర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం రావడంతో పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తున్నారు. అలాగే గవర్నర్‌ దత్తాత్రేయ లాంటి రాజకీయ ప్రముఖులు బన్నీకి విషెస్‌ చెప్పి మరీ సత్కరిస్తున్నారు

Allu Arjun- Posani: అల్లు అర్జున్‌ మంచి మిత్రుడు.. ఆరోజు నాకు 5 లక్షలిచ్చి ఏమన్నాడంటే? పోసాని
Posani Krishna Mural, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Aug 30, 2023 | 5:19 PM

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 69 ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ సినిమా అవార్డుల్లో మొదటి సారిగా ఒక తెలుగు యాక్టర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం రావడంతో పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తున్నారు. అలాగే హర్యానా గవర్నర్ దత్తాత్రేయ లాంటి ప్రముఖులు బన్నీకి విషెస్‌ చెప్పి మరీ సత్కరిస్తున్నారు. తాజాగా ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అల్లు అర్జున్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ‘అల్లు అర్జున్ నాకు మంచి మిత్రుడు. అతనికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఓసారి నాకు రూ.5 లక్షల చెక్‌ ఇచ్చాడు. నాకెందుకిచ్చావని అడిగితే ‘మీరు చాలా మందికి గుండె ఆపరేషన్‌ చేయించారని నాకు తెలుసు. మీరు మంచి పనికే డబ్బు ఉపయోగిస్తారు. అందుకే ఇచ్చానన్నాడు. ఆ డబ్బును ఆర్థిక సమస్యలతో చదువు ఆపేసిన ముగ్గురు విద్యార్థులకు పంచాను. అలాగే ఈ డబ్బులిచ్చింది అల్లు అర్జున్‌ కాబట్టి, ఆయనకు పిల్లలతో లైవ్‌లో థ్యాంక్స్‌ చెప్పించాను’ అని అల్లు అర్జున్‌తో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు పోసాని.

మరోవైపు ఏపీలోని కళాకారులందరికీ అండగా ఉంటామన్నారు పోసాని. అలాగే రాష్ట్రంలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇతర నిపుణులందరికీ ఉచితంగా గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు ‘ పద్య,గద్య నాటకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నాం. నాటకాలకు అందిన దరఖాస్తులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. త్వరలో ఏపీలో ఉన్న నటులు,ఫైటర్లు,సంగీత దర్శకులు,ఇతర కళాకారులకు ఐడీ కార్డులు జారీ చేస్తాం. అలాగే కళాకారులకు ఇవ్వాల్సిన రాయితీలపై కూడా త్వరలో దృష్టి పెడతాం. చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ లు షూటింగ్ కు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఉన్న కళాకారులు అందరిని ఒకేతాటి పైకి వచ్చి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీలో ఉన్న కళాకారులు లిస్ట్ మొత్తం రెడీ అయితే షూటింగ్ లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంది కళాకారులు దళారుల చేతిలో పడి ఇబ్బందులు పడుతున్నారు. కళాకారుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’ అని పోసాని తెలిపారు.

ఇవి కూడా చదవండి

‘పుష్ప 2.. ది రూల్’ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్ 

View this post on Instagram

A post shared by Instagram (@instagram)

అల్లు అర్జున్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..