Raghava Lawrence: ఇతను కదరా మనిషంటే.. తన ట్రస్ట్‌కు ఎవ్వరూ డొనేషన్స్ పంపొద్దన్న లారెన్స్

నా ట్రస్ట్‌కి ఎవరూ డొనేషన్స్ పంపించకండి. నా పిల్లలను నేను చూసుకుంటానని ఇటీవల రాఘవ లారెన్స్ ఓ ట్వీట్‌ చేశారు. ఆయన అలా ఎందుకన్నారో కొందరికి అర్థం కాలేదు. తాజాగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు లారెన్స్. ‘స్టైల్‌’, ‘ముని’, ‘కాంచన’ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన నటించిన కొత్త సినిమా ‘చంద్రముఖి 2’తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Raghava Lawrence: ఇతను కదరా మనిషంటే.. తన ట్రస్ట్‌కు ఎవ్వరూ డొనేషన్స్ పంపొద్దన్న లారెన్స్
Raghava Lawrence
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 30, 2023 | 6:20 PM

ఒక మనిషికి కష్టంలో సాయం చేసేవాడు నిజంగా దేవుడే. సాయాన్ని మించిన దైవం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఎలాంటి రోజులు దాపరించాయి అంటే.. ఒక మనిషి సాయం చేస్తే.. అది కూడా ఒక వార్తగా మారేంత. పాత కాలంలో అయితే నిజంగా జనాలు ఇలా లేరు. ఇంత స్వార్థం లేదు. కష్టంలో ఎవరైనా ఉన్నారని తెలిస్తే.. తొటి మనిషి వెళ్లి తోడుగా నిలబడేవాడు. ఇప్పుడు సాయం చేసే మనుషుల్ని అరుదుగా వెతుక్కోవాల్సిన పరిస్థితి. సాయం పేరుతో మోసాలకు పాల్పడేవారు కూడా అందుకు ఒక కారణం. ఇకపోతే సాయం అంటే మనకు గుర్తు వచ్చే యాక్టర్స్ ఎవరంటే.. రాఘవ లారెన్స్, పునీత్ రాజ్ కుమార్, అక్షయ్ కుమార్, సోనూ సూద్ వంటివారు. ముఖ్యంగా లారెన్స్ తన కెరీర్ తొలినాళ్ల నుంచి అనాథలకు, దివ్యాంగులకు ఒక ఆశాదీపంలా ఉన్నారు. వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల తన ట్రస్ట్‌కు డొనేషన్స్ పంపవద్దంటూ ఇటీవల ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. పలు రకాల కామెంట్స్ సైతం వచ్చాయి. దీంతో అందుకు గల కారణాన్ని వివరిస్తూ లారెన్స్ ఓ వీడియో విడుదల చేశారు.

“డ్యాన్స్‌ మాస్టర్‌గా ఉన్నప్పుడు ఒక ట్రస్ట్‌ ప్రారంభించా. 60 మంది చిన్నారుల బాధ్యతలు తీసుకున్నా. నాట్యంపై ఆసక్తి కలిగిన దివ్యాంగులకు శిక్షణ ఇచ్చా. అప్పుడు నేను కొరియోగ్రాఫర్‌గా ఉన్నా… ఆర్థిక కారణాల వల్ల సేవా కార్యక్రమాల్లో ఇబ్బంది తలెత్తేది. అందుకు ఆనాడు విరాళాలు తీసుకున్నా. కానీ, ఇప్పుడు నేను దర్శకుడిగా, కథానాయకుడిగా రాణిస్తున్నా. మొదట్లో రెండేళ్లకు ఒక మూవీలో నటించేవాడిని. ఇప్పుడు ఏడాదికి 3 సినిమాలు చేస్తున్నా. ఆదాయం కూడా బానే ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక కూడా వేరే వాళ్ల సాయం తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే వీరాళాలు వద్దన్నా తప్ప.. పొగరుతో కాదు. నిజంగా మీరు సాయం చేయాలనుకుంటే.. ఇబ్బందుల్లో ఉన్నవారికి తోడుగా నిలబడండి. లేదా వేరే ట్రస్ట్‌ల ద్వారా ఇతరులకు సాయం చేయండి’’ అని లారెన్స్ పిలుపునిచ్చారు.

ఒక సైడ్ డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన లారెన్స్.. అంచెలంచులగా ఎదిగాడు. డ్యాన్స్ మాస్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం  ‘చంద్రముఖి 2’ త్వరలో ప్రేక్షకుల  ముందుకు రాబోతుంది. కాగా తెలుగు ఇండస్ట్రీలోనూ లారెన్స్ సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంది.

లారెన్స్ మాట్లాడిన వీడియో దిగువన చూడండి….

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..