Hyderabad: అయ్యో.. ఇంతలోనే ఏమైందో.. పెళ్లై 21 రోజులే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

వివాహం జరిగి 21 రోజులే అయింది. భార్య కూడా ఉద్యోగం చేస్తుంది.. ఇంతలోనే ఏమైందో .. ఏమో.. కానీ.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నిండు ప్రాణాలు తీసుకున్నాడు.. ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.. రాజేంద్రనగర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బలవన్మరణానికి పాల్పడటం సంచలనంగా మారింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: అయ్యో.. ఇంతలోనే ఏమైందో.. పెళ్లై 21 రోజులే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2025 | 12:32 PM

వివాహం జరిగి 21 రోజులే అయింది. భార్య కూడా ఉద్యోగం చేస్తుంది.. ఇంతలోనే ఏమైందో .. ఏమో.. కానీ.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నిండు ప్రాణాలు తీసుకున్నాడు.. ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.. రాజేంద్రనగర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బలవన్మరణానికి పాల్పడటం సంచలనంగా మారింది.. పెళ్లైన మూడు వారాలకే అరుణ్‌ కుమార్ అనే ఉద్యోగి సూసైడ్‌ చేసుకున్నాడని.. మృతుడు అరుణ్‌‌ స్వస్థలం కర్నూలుగా పోలీసులు తెలిపారు.

కర్నూల్ కు చెందిన నవదంపతులు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో నివాసముంటున్నారు. భార్యభర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లే.. వీరి వివాహం జరిగి 21 రోజులైంది.. పెళ్లి తర్వాత ఇద్దరూ ఇక్కడకు వచ్చి నివాసముంటున్నారు.. ఏమైందో ఏమో కానీ.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అర్ధరాత్రి సమయంలో తాను ఆఫిస్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం విగతజీవిలా పడి ఉన్న అరుణ్ ను చూసి భార్య షాకైంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు.. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

అయితే.. ఇద్దరి అంగీకారంతోనే పెద్దల సమక్షంలో ఇద్దరి వివాహం జరిగింది.. వేడుకలా పెళ్లి తంతు చేశారు.. కానీ.. ఒక్కసారిగా అరుణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనేది కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదు.. ఈ ఘటనపై పోలీసులు అరున్ భార్య నుంచి పలు వివరాలు సేకరించారు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్ సెల్ ఫోన్ ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..