Naa Saami Ranga: నాగ్ ‘నా సామిరంగా’లో కనిపించిన ఈ విలన్‌ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్‌.. ఎవరో గుర్తుపట్టారా?

మంగళవారం (ఆగస్టు 29 రిలీజైన నా సామిరంగ గ్లింప్స్‌లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు తీసే ఓ డైరెక్టర్‌ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడం.. గ్లింప్స్‌ ప్రారంభంలో కారులో నుంచి ఓ వ్యక్తి పంచెకట్టులో బయటకు వస్తాడు.. 'ఈ పండక్కి పనైపోవాలి' అంటూ ఓ ఇంటెన్స్‌ వాయిస్‌తో డైలాగ్‌ చెబుతాడు. ఆ తర్వాత బార్‌ లోపలికి వెళ్లి స్టైల్‌గా సిగరెట్‌ అంటించి తన అనుచరులతో మాట్లాడుతాడు. ఆ కాసేపటికే నాగార్జును ఎంట్రీ ఇవ్వడం, కింగ్‌ చేతిలో చావు దెబ్బలు తిని, తలుపు బద్దలు కొట్టుకుని బయట పడతాఉ. ఆ వ్యక్తి మరెవరో  కాదు

Naa Saami Ranga: నాగ్ 'నా సామిరంగా'లో కనిపించిన ఈ విలన్‌ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Na Sami Ranga Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 30, 2023 | 6:34 PM

ఘోస్ట్‌’ తర్వాత కొద్దిగా గ్యాప్‌ తీసుకున్న అక్కినేని నాగార్జున కొత్త సినిమాతో మన ముందుకు వచ్చారు. ‘నా సామి రంగ’ అంటూ ఊర మాస్‌ మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్టు 29)ను పురస్కరించుకుని విడుదలైన ‘నా సామి రంగ’ గ్లింప్స్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇందులో రగ్డ్‌ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు నాగ్‌. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ నా సామిరంగాతో డైరెక్టర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు. నేను లోకల్‌, ధమాకా వంటి సినిమాలు అందించిన ప్రసన్న కుమార్‌ బెజవాడ నాగ్‌ సినిమాకు కథను అందించారు. ఆస్కార్‌ గ్రహీత ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తుండడం విశేషం. ఇక మంగళవారం (ఆగస్టు 29 రిలీజైన నా సామిరంగ గ్లింప్స్‌లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు తీసే ఓ డైరెక్టర్‌ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడం.. గ్లింప్స్‌ ప్రారంభంలో కారులో నుంచి ఓ వ్యక్తి పంచెకట్టులో బయటకు వస్తాడు.. ‘ఈ పండక్కి పనైపోవాలి’ అంటూ ఓ ఇంటెన్స్‌ వాయిస్‌తో డైలాగ్‌ చెబుతాడు. ఆ తర్వాత బార్‌ లోపలికి వెళ్లి స్టైల్‌గా సిగరెట్‌ అంటించి తన అనుచరులతో మాట్లాడుతాడు. ఆ కాసేపటికే నాగార్జును ఎంట్రీ ఇవ్వడం, కింగ్‌ చేతిలో చావు దెబ్బలు తిని, తలుపు బద్దలు కొట్టుకుని బయట పడతాఉ. ఆ వ్యక్తి మరెవరో  కాదు.. పలాస 1978 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్‌ కరుణ కుమార్.

ఇవి కూడా చదవండి

సమాజంలోని కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ కరుణ కుమార్‌ పలాస సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ పలువురి అందరినీ ఆకట్టుకుంది. డైరెక్టర్‌గానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత సుధీర్‌ బాబు, ఆనంది జంటగా శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాను రూపొందించాడు. పరువు హత్యల గురించి చర్చిస్తూ రూపొందించిన ఈ సినిమా కూడా పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో కలిసి మట్కా అనే మరో డిఫరెంట్ మూవీను తెరకెక్కిస్తున్నాగు. కాగా గతంలోను కొన్ని సినిమాల్లో నటునిగా కనిపించాడు కరుణ్‌ కుమార్‌. సత్యదేవ్‌ హీరోగా నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీలో కరుణ అనే ఓ చిన్న పాత్రలో మెరిశాడు. ఇప్పుడు నా సామి రంగ సినిమాలో ఏకంగా కింగ్‌ నాగార్జునను ఎదుర్కొనే విలన్‌ పాత్రలో కనిపించాడు. లుక్‌, డైలాగ్‌ డెలివరీ అండ్‌ గెటప్‌ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మరి డైరెక్టర్‌గా సక్సెస్‌ అయిన కరుణ కుమార్‌ నటుడిగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

నా సామిరంగ గ్లింప్స్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..