Tollywood: యంగ్ హీరోలు వరస్ట్.. పాత తరమే బెస్ట్.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

పాత తరం నటీనటులతో పోలిస్తే ఇప్పటి తరం వరస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మలయాళీ హీరోయిన్. యువ నటులు సోమరితనం, నిరాశను ప్రదర్శిస్తారని విమర్శలు చేసింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఆ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

Tollywood: యంగ్ హీరోలు వరస్ట్.. పాత తరమే బెస్ట్.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
Parvathy
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2025 | 8:13 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే అద్భుతమైన నటనతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలు.. విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ స్టార్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటితరం కంటే పాతతరమే బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ? తనే హీరోయిన్ పార్వతి తిరువోతు. ఇటీవల విక్రమ్ చియాన్ నటించిన తంగలాన్ చిత్రంలో కథానాయికగా కనిపించి ఆకట్టుకుంది.

ఇటీవల వాయనాడ్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా భారతీయ రచయిత్రి అరుంధతీ రాయ్‌తో చాట్‌లో పాల్గొంది పార్వతి. ఈ క్రమంలోనే మలయాళ సినిమాలోని యువ నటులు కొనసాగుతున్న దృశ్యాలకు ఏదైనా మద్దతు ఇస్తున్నారా ? అని అడగ్గా.. ఇప్పటితరం వరస్ట్ అని.. పాతతరమే బెస్ట్ అంటూ వెల్లడించింది. యువ నటులకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అంతా తెలుసు.. కానీ అసమాన అవకాశాల కారణంగా అసంతృప్తితో ఉన్నారని తెలిపింది. పాతతరం పితృస్వామ్య వ్యవస్థ స్త్రీద్వేషంతో ప్రభావితమవుతుండగా.. యువతరం నటులు కొన్ని ఇతర కారణాల వల్ల నిరాశకు గురవుతున్నారని అన్నారు. పాత తరం అనుభవిస్తున్న ప్రయోజనాలను అందుకోలేక నేటితరం నిరాశకు గురవుతున్నారని అన్నారు.

“ఆల్ఫా-పురుష” పాత్రలతో కొన్ని పెద్ద సినిమాలు తీశారు. మహిళల గురించి పాత భావనలను తిరిగి తీసుకురావడానికి ఇలాంటివి తీసారు అంటూ చెప్పుకొచ్చింది. తాను గతంలో ఓ సినిమా చూశానని.. భవిష్యతులో మళ్లీ ఇలాంటి వారితో కలిసి పనిచేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందానని తెలిపింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.