TGPSC Group 3 Answer Key: టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 3 రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి కీ డైన్ లోడ్ చేసుకోవచ్చు. ఆనర్స్ కీపై అభ్యంతరాలు లేవనెత్తే వారు జనవరి 12, 2025 సాయంత్రం 5:00 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యంతరాలు ఇంగ్లీషులో మాత్రమే తెల్పవల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధి పేరు, ఎడిషన్, పేజీ నంబర్ వంటి రిఫరెన్స్ వివరాలను స్పష్టంగా పేర్కొనవల్సి ఉంటుంది.
హైదరాబాద్, జనవరి 9: ఎన్నో రోజుల ఎదురు చూపుల తర్వాత ఎట్టకేలకు గ్రూప్ 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. టీజీపీఎస్సీ గ్రూప్ 3 ప్రాథమిక ఆన్సర్ కీని కమీషన్ తాజాగా విడుదల చేసింది. గ్రూప్ 3 పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా వచ్చే రెండ్రోజుల్లో గ్రూప్ 2 ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే రెండు రోజుల్లోనే కీ విడుదల చేశారు. దీంతో షెడ్యూల్ ప్రకారం ఫలితాలు కూడా వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. జనవరి 11, 12 తేదీల్లో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉంటుందని, ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చించనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఆనర్స్ కీపై అభ్యంతరాలు లేవనెత్తే వారు జనవరి 12, 2025 సాయంత్రం 5:00 గంటలలోపు ఆన్‌లైన్‌లో ఇంగ్లీషులో మాత్రమే తెల్పవల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 1,365 గ్రూప్ 3 సర్వీసు పోస్టులకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా 5,36,400 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది పరీక్ష రాశారు. సగం మంది మాత్రమే గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్ష జరిగాయి. ఇక ఇప్పటికే గ్రూప్3 రాతపరీక్షల ఫలితాల గురించి కమిషన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ పోస్టుల తుదిఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతున్నారని. దీంతో అధిక పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోతున్నాయని గతంలో కమిషన్ అభిప్రాయపడింది. ఇలా జరగకుండా ఉండేందుకు రీలింక్విష్‌మెంట్ విధానం తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటికే గ్రూప్ 1, 2, 3 రాతపరీక్షలు పూర్తికాగా వీటి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించిన తరువాతే.. గ్రూప్-2, 3 ఫలితాలు ఇస్తే బ్యాక్‌లాగ్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. కాబట్టి గ్రూప్ 1 ఫలితాలు వచ్చే గ్రూప్ 3 ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది.