​వారెవ్వా జాన్వీ కపూర్ అందాలు అదరహో..లేటెస్ట్ పిక్స్ వైరల్

Phani CH

08 January 2025

Credit: Instagram

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందీ భామ.

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో  తెరకెక్కిన ‘దేవర’ చిత్రంతో  టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది

ఇక తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కేవలం స్కిన్ షోకే పరిమితమైంది. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ఈ బ్యూటీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు 7 యేడేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ  హీరోయిన్ గా సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి.

శ్రీదేవి కూతురుగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు ముమ్మురం చేసింది.