AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Stampede Highlights: తిరుపతి ఘటనపై చంద్రబాబు సంచలన నిర్ణయం.. అధికారులపై వేటు

Tirumala Tirupati Stampede Highlights in Telugu: ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష వినిపించింది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆ ఏడుకొండల వాడి సన్నిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. 48 మంది అస్వస్థతకు గురయ్యారు.

Tirupati Stampede Highlights: తిరుపతి ఘటనపై చంద్రబాబు సంచలన నిర్ణయం.. అధికారులపై వేటు
Tirupati Stampde
Shaik Madar Saheb
| Edited By: Subhash Goud|

Updated on: Jan 09, 2025 | 9:17 PM

Share

ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష వినిపించింది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల అర్తనాదాలతో దద్దరిల్లింది. ఆ ఏడుకొండల వాడి సన్నిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన ఆరుగురిలో.. ఐదుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి చెందారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందన్నారు చంద్రబాబు. మరోవైపు బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్తున్నారు.

సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. గంటలు వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది.

లైవ్ వీడియో చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Jan 2025 09:14 PM (IST)

    భద్రతా ప్రొటోకాల్స్‌ ఎందుకు పాటించలేదు- జగన్‌

    తిరుపతి స్విమ్స్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బాధితులను పరామర్శించారు. తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట ఘటన జరగలేదు. లక్షల మంది భక్తులు వస్తారని ముందే తెలిసినా భద్రతా ప్రొటోకాల్స్‌ ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.

  • 09 Jan 2025 09:01 PM (IST)

    డీఎస్పీ బాధ్యత లేకుండా పని చేశారు- సీఎం

    తిరుమల ఘటనపై అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. డీఎస్పీ రమణ కుమార్‌ బాధ్యత లేకుండా పని చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాగే గోశాల ఇన్‌ఛార్జ్‌ హరినాథ్‌ బాధ్యత విస్మరించారని అన్నారు.

  • 09 Jan 2025 08:36 PM (IST)

    పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

    తిరుమల ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగింది..క్షమించాలని కోరారు. అలాగే టీటీడీలో ప్రక్షాళన జరగాలని, సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టాలన్నారు. మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి టీటీడీ సభ్యులు క్షమాపణ చెప్పాలన్నారు.

  • 09 Jan 2025 07:44 PM (IST)

    తప్పు జరిగింది.. క్షమించండి: పవన్

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “తప్పు జరిగింది.. క్షమించండి.. ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి మధ్య గొడవలున్నాయి” అని పేర్కొన్నారు.

  • 09 Jan 2025 06:26 PM (IST)

    జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశం

    తిరుమల తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్‌ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

    – డీఎస్పీ రమణకుమార్‌ సస్పెన్షన్‌

    – గోశాల డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి సస్పెన్షన్‌

    – చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ శ్రీధర్‌ బదిలీ

    – ఎస్పీ సుబ్బారాయుడు ట్రాన్స్‌ఫర్‌

    – జేఈవో గౌతమి ట్రాన్స్‌ఫర్‌

  • 09 Jan 2025 06:19 PM (IST)

    చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీస్‌ శ్రీధర్‌ సస్సెండ్‌

    తిరుమలలో తొక్కిసలాట ఘటన అందరిని కలచివేసింది. దీంతో అధికారులపై వేటు పడింది. ఈ ఘటనలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేశారు.

  • 09 Jan 2025 06:16 PM (IST)

    అధికారులపై సస్పెన్షన్‌ వేటు

    తిరుపతి ఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులను సస్సెన్షన్‌ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డీఎస్పీ రమణకుమార్‌, గోశాల డైరెక్టర్‌ హఱనాథరెడ్డిలను సస్పెన్షన్‌కు గురయ్యారు.

  • 09 Jan 2025 05:54 PM (IST)

    తొక్కిసలాట మనస్సును కలచివేసింది: చంద్రబాబు

    తిరుపతిలో తొక్కిసలాట చాలా బాధేసిందని, ఈ తొక్కిసలాట మనస్సును కలచి వేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

  • 09 Jan 2025 05:54 PM (IST)

    తిరుమలకు జగన్‌

    తిరుమలలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుమలకు బయలుదేరారు. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

  • 09 Jan 2025 04:30 PM (IST)

    అధికారుల తీరుపై పవన్‌ ఆగ్రహం

    తిరుమలలో జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. జరిగిన ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి గురించి ఆరా తీశారు. అధికారుల తీరుపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 09 Jan 2025 04:27 PM (IST)

    తిరుమలకు పవన్‌

    తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. తిరుమలలో జరిగిన తొక్కిలాట ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

  • 09 Jan 2025 03:52 PM (IST)

    బాధ్యత తీసుకుంటే నెరవేర్చాలి: సీఎం చంద్రబాబు

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులను ప్రశ్నించిన సీఎం ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దంటూ మండిపడ్డారు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్‌ల గురించి ఆరా తీశారు.

  • 09 Jan 2025 03:31 PM (IST)

    సహాయ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ఆరా..

    తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ దగ్గర ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

  • 09 Jan 2025 03:09 PM (IST)

    స్విమ్స్‌ ఆస్పత్రికి సీఎం చంద్రబాబు

    తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.  ఘటన గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పద్మావతి మెడికల్‌ కాలేజీకి వెళ్లిన చంద్రబాబు తొక్కిసలాట బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

  • 09 Jan 2025 02:47 PM (IST)

    తిరుపతి బయలుదేరిన పవన్ కల్యాణ్

    రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి   పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి తిరుపతి బయలుదేరారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రదేశాన్ని పరిశీలించనున్న ఆయన ఆ  తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.

  • 09 Jan 2025 02:05 PM (IST)

    అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్‌

    • బైరాగిపట్టెడలో తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు
    • అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్‌
    • బాధ్యత తీసుకున్నవారు నెరవేర్చాలి – చంద్రబాబు
    • పద్దతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి – సీఎం
    • టీటీడీ ఈవో, కలెక్టర్‌, ఎస్పీ, అధికారులపై సీఎం మండిపాటు
    • 2వేల మందే పడతారు అనుకున్నప్పుడు.. 2500 మందిని లోపలికి ఎందుకు పంపించారు
    • భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందన్న అధికారులు.. బయటకు వదిలేప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరణ..
    • బైరాగిపట్టెడ దగ్గర బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్‌ ఎవరు..? ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగింది..? ఎక్కువ మంది ఉన్నప్పుడు గేట్ తీసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా..?

    -సీఎం చంద్రబాబు నాయుడు

  • 09 Jan 2025 01:54 PM (IST)

    తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

    సీఎం చంద్రబాబు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాసేపట్లో స్విమ్స్‌కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.. ఆ తర్వాత.. టీటీడీ పరిపాలన భవనంలో సీఎం సమీక్ష ఉంటుంది. సమీక్షకు రాష్ట్ర మంత్రులు, టిటిడి చైర్మన్, ఈవో, జిల్లా కలెక్టర్ ఎస్పీ హాజరుకానున్నారు.

  • 09 Jan 2025 01:23 PM (IST)

    ఆరుగురు చనిపోతే 194 కేసు పెట్టడమేంటి: మాజీ మంత్రి రోజా

    • ఘటనపై పీఠాధిపతులు మాట్లాడాలి
    • అల్లు అర్జున్‌కు సంబంధం లేకపోయినా 302 కేసుపెట్టారు
    • ఆరుగురు చనిపోతే 194 కేసు పెట్టడమేంటి
    • ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది
    • పవన్‌ కల్యాణ్ బయటకు వచ్చి మాట్లాడాలి

    -మాజీ మంత్రి రోజా

  • 09 Jan 2025 01:13 PM (IST)

    తిరుపతికి వెళ్లనున్న పవన్‌, లోకేష్‌

    కాసేపట్లో తిరుపతికి చంద్రబాబు

    బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

    అనంతరం టీటీడీ, ప్రభుత్వ, పోలీసు అధికారులతో సమీక్ష

    కర్నూలు జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన రద్దు

    మంత్రి లోకేష్‌ పర్యటన రద్దు

    తిరుపతి ఘటన నేపథ్యంలో పర్యటనలు రద్దు

    తిరుపతికి వెళ్లనున్న పవన్‌, లోకేష్‌

    మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లనున్న మాజీ సీఎం జగన్‌

    తిరుపతి బాధితులను పరామర్శించనున్న జగన్‌

  • 09 Jan 2025 01:11 PM (IST)

    గాయపడిన 41మందిలో 21మంది డిశ్చార్జ్‌

    తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి

    గాయపడిన 41మందిలో 21మంది డిశ్చార్జ్‌

    మిగతా క్షతగాత్రుల్లో ముగ్గురికి మాత్రమే తీవ్రగాయాలు

    ఐదుగురి మృతిపై తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసులు నమోదు

    బైరాగిపట్టెడలో నలుగురు మృతిపై నారాయణవనం ఎమ్మార్వో ఫిర్యాదు

    శ్రీనివాసం దగ్గర ఒకరు మృతిపై బాలయ్యపల్లి ఎమ్మార్వో ఫిర్యాదు

    BNS 194 సెక్షన్ కింద కేసు నమోదుచేసిన పోలీసులు

  • 09 Jan 2025 12:55 PM (IST)

    నిర్లక్ష్యం ఎవరిది? -గుడివాడ

    తిరుపతి ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

    లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా ఎందుకు ఏర్పాట్లు చేయలేదు?

    భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఎవరిది? -గుడివాడ

  • 09 Jan 2025 12:44 PM (IST)

    ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన

    • తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆవేదన
    • ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన
    • బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
    • మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్
    • -భూమన కరుణాకర్‌రెడ్డి
  • 09 Jan 2025 12:30 PM (IST)

    తిరుపతిలో తొక్కిసలాట దురదృష్టకరం

    తిరుపతిలో తొక్కిసలాట దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    ఏపీ ప్రభుత్వం, టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి సందర్భాల్లో తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాల సహకారం తీసుకోవాలన్నారు శ్రీనివాస్ గౌడ్‌

  • 09 Jan 2025 12:25 PM (IST)

    తిరుపతి ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు

    తిరుపతి ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు

    ప్రభుత్వం, టీటీడీ.. బాధ్యత వహించాల్సిందే

    మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి

    బిచ్చం వేసినట్టు రూ.25లక్షల ఇస్తే కుదరదు

    – సీపీఎం నేత బీవీ రాఘవులు

  • 09 Jan 2025 12:15 PM (IST)

    తిరుపతి ఘటనపై చంద్రబాబు సమీక్ష

    తిరుపతి ఘటనపై చంద్రబాబు సమీక్ష

    సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు

    తొక్కిసలాట కారణాలపై నివేదక అందించిన అధికారులు

    క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం

    మరికాసేపట్లో తిరుపతి బయలుదేరనున్న సీఎం చంద్రబాబు

  • 09 Jan 2025 11:51 AM (IST)

    తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు

    తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం

    రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

    ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రిఅనగాని సత్యప్రసాద్

    తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు

    ఈస్ట్‌ పీఎస్‌లో నారాయణవనం తహశీల్దార్‌ ఫిర్యాదు

    BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

  • 09 Jan 2025 11:38 AM (IST)

    తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

    • తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం
    • రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
    • ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రిఅనగాని సత్యప్రసాద్
  • 09 Jan 2025 11:19 AM (IST)

    తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమెవరో తేల్చాలి: రాజాసింగ్

    తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. భక్తుల మాటల ప్రకారం పోలీసుల వైఫల్యం క్లియర్‌గా కనిపిస్తోందన్నారు. మొత్తం ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు రాజాసింగ్‌.

  • 09 Jan 2025 10:54 AM (IST)

    మరికాసేపట్లో తిరుపతి బయల్దేరనున్న సీఎం చంద్రబాబు

    మరికాసేపట్లో ఉండవల్లి నివాసం తిరుపతి బయల్దేరనున్న సీఎం చంద్రబాబు

    మధ్యాహం 12గంటలకల్లా తిరుపతి చేరుకోనున్న సీఎం

    స్విమ్స్‌లో బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు

    క్షతగాత్రులు, మృతుల కుటుంబాల సభ్యులతో మాట్లాడనున్న సీఎం

    బాధితులను పరామర్శించాక టీటీడీ అధికారులతో సీఎం సమీక్ష

    క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించనున్న సీఎం

    తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే అధికారులపై సీరియస్‌ అయిన సీఎం

  • 09 Jan 2025 10:45 AM (IST)

    టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు

    — నిర్లక్ష్యంగా గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది

    — ముందుజాగ్రత్త తీసుకోకుండా డీఎస్పీ గేట్లు తెరిచినట్టు తెలిసింది

    — పూర్తిస్థాయి విచారణ తర్వాతే కారణాలు తెలుస్తాయి -టీటీడీ ఈవో

    — 41మంది గాయపడ్డారు.. వాళ్లలో 20మంది వరకు డిశ్చార్జ్‌ అయ్యారు

    — ఇద్దరు ముగ్గురికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి -టీటీడీ ఈవో

  • 09 Jan 2025 10:23 AM (IST)

     తిరుపతికి మంత్రుల బృందం

    — వెంటనే తిరుపతికి వెళ్లాలని ముగ్గురు మంత్రులకు సీఎం ఆదేశం

    — తిరుపతి, తిరుమలలో పరిస్థితిని సమీక్షించాలని మంత్రులకు దిశానిర్దేశం

    — తిరుపతిలోనే ఉండాలని ముగ్గురు మంత్రులను ఆదేశించిన సీఎం

    — క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న చంద్రబాబు

    — సీఎం ఆదేశాలతో తిరుపతి బయల్దేరిన ఆనం రాంనారాయణరెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్‌

    — ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రులు

    — టోకెన్ల జారీ ప్రక్రియను సమీక్షించనున్న మంత్రుల బృందం

    — పరిస్థితి చక్కబడేవరకు తిరుపతిలోనే ఉండనున్న హోం, రెవెన్యూ, దేవాదాయశాఖ మంత్రులు

  • 09 Jan 2025 10:16 AM (IST)

    అన్ని చర్యలు తీసుకుంటున్నాం

    తిరుపతి ఘటనలో మృతి చెందిన ఐదుగురు కి రుయా ఆసుపత్రి నందు పోస్టుమార్టం నిర్వహించి సంబంధిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

  • 09 Jan 2025 10:15 AM (IST)

    డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ రద్దు..

    తిరుపతిలో జరిగిన తొక్కిలాటలో కొందరు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరం. మృతులకు నా నివాళి. వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన..డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో దానిని రద్దు చేయడంజరిగింది.

    -నందమూరి బాలకృష్ణ

  • 09 Jan 2025 10:14 AM (IST)

    కాసేపట్లో తిరుపతికి మంత్రుల బృందం

    కాసేపట్లో తిరుపతికి మంత్రుల బృందం

    వెంటనే తిరుపతికి వెళ్లాలని ముగ్గురు మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

    తిరుపతి, తిరుమలలో పరిస్థితిని సమీక్షించాలని మంత్రులకు దిశానిర్దేశం

    తిరుపతిలోనే ఉండాలని ముగ్గురు మంత్రులను ఆదేశించిన సీఎం

    క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న చంద్రబాబు

    సీఎం ఆదేశాలతో తిరుపతి బయల్దేరిన ఆనం రాంనారాయణరెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్‌

    ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రులు

    టోకెన్ల జారీ ప్రక్రియను సమీక్షించనున్న మంత్రుల బృందం

    పరిస్థితి చక్కబడేవరకు తిరుపతిలోనే ఉండనున్న హోం, రెవెన్యూ, దేవాదాయశాఖ మంత్రులు

  • 09 Jan 2025 10:08 AM (IST)

    యథావిధిగా కొనసాగుతున్న టోకెన్ల జారీ

    — తిరుపతి, తిరుమలలో యథావిధిగా కొనసాగుతున్న టోకెన్ల జారీ

    — 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా టోకెన్లు అందిస్తున్న టీటీడీ

    — మూడు రోజులకుగాను మొత్తం లక్షా 20వేల టోకెన్లు జారీ

    — టోకెన్లు పూర్తి అయ్యేంత వరకు నిరంతరాయంగా జారీ

    — ఆఫ్‌లైన్‌లో రోజుకు 40వేల టికెట్లు జారీ

    — ఏ రోజుకు ఆరోజు మాత్రమే జారీ చేయనున్న టీటీడీ

    — రోజుకి 70వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

  • 09 Jan 2025 09:43 AM (IST)

    ఘటనకు కారణాలపై విచారణ జరుపుతున్నాం- ఈవో

    డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని.. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని.. టీటీడీ ఈవో శ్యామలా రావు తెలిపారు. పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలా రావు పరామర్శించారు.

  • 09 Jan 2025 09:30 AM (IST)

    మిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విచారం

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తంచేశారు.. ఈ దురదృష్టకర ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • 09 Jan 2025 09:17 AM (IST)

    క్షతగాత్రుల వివరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల వివరాలు గుర్తింపు

    తొక్కిసలాటలో ఐదుగురు మహిళలుతో పాటు ఓ వ్యక్తి మృతి

    విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు

    కోలుకుంటున్న తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ భక్తులు

    తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08772236007

    నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు

    మద్యాహ్నం 12 గంటలకు తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు

    రుయా, స్విమ్స్ బాధితులను పరామర్శించనున్న సీఎం

    అనంతరం టీటీడీ ఈవో, అధికారులతో చంద్రబాబు సమీక్ష

  • 09 Jan 2025 09:07 AM (IST)

    టోకెన్ల జారీ మొదలుపెట్టకముందే తొక్కిసలాట

    తిరుపతి తొక్కిసలాట వెనక టీటీడీ అధికారుల వైఫల్యం..!

    షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లవారుజాము 4గంటల నుంచి టోకెన్ల జారీకి ప్లాన్‌

    నిన్న ఉదయం నుంచే అన్ని సెంటర్లకు వేలాదిగా పోటెత్తిన భక్తులు

    రద్దీ అధికంగా ఉండటంతో రాత్రి నుంచే టోకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ

    బైరాగిపట్టెడ దగ్గర టోకెన్ల జారీ మొదలుపెట్టకముందే తొక్కిసలాట

    కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యంతో పెను విషాదం

  • 09 Jan 2025 08:55 AM (IST)

    సమన్వయ లోపంతో

    సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. బైరాగిపట్టెడలో గంటల కొద్ది వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది.

  • 09 Jan 2025 08:42 AM (IST)

    యధావిధిగా కొనసాగుతున్న టోకెన్ల జారీ

    తిరుపతి తిరుమలలో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లలో యధావిధిగా టోకెన్ల జారీ కొనసాగుతోంది.. మూడు రోజులకుగాను లక్ష 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.. నిరంతరాయం గా లక్షా 20 వేల టోకెన్లు పూర్తి అయ్యేంత వరకు జారీ చేయనున్నారు.. ఆ తరువాత రోజుకు 40 వేలు టికెట్లను ఏ రోజు కు ఆ రోజు మాత్రమే టీటీడీ జారీ చేయనుంది.

  • 09 Jan 2025 08:38 AM (IST)

    ఏపీ నుంచి నలుగురు, తమిళనాడుకు చెందిన ఇద్దరు..

    మృతులు విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిగ, నరసరావు పేటకు చెందిన బాబు నాయుడు, రజినీగా గుర్తించారు. మృతులకు రుయాలో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం తర్వాత బంధువులకు డెడ్‌బాడీలను అప్పగించనున్నారు.

  • 09 Jan 2025 08:34 AM (IST)

    రుయాలో 34, స్విమ్స్‌లో 14మందికి చికిత్స

    రుయాలో నలుగురు, సీన్స్ లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డ క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి.. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో 48మంది క్షతగాత్రులు ఉన్నట్లు పేర్కొన్నారు. రుయాలో 34, స్విమ్స్‌లో 14మందికి చికిత్స అందుతోంది..

  • 09 Jan 2025 08:02 AM (IST)

    తిరుపతి తొక్కిసలాట వెనక అధికారుల వైఫల్యం -టీటీడీ ఛైర్మన్‌

    రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న టీటీడీ ఛైర్మన్‌.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు

  • 09 Jan 2025 07:57 AM (IST)

    మెరుగైన చికిత్స అందించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

    తిరుపతిలో బుధవారం క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు యాత్రికులు మరణించడం, అనేక మంది గాయపడటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స సౌకర్యాలు కల్పించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు.. మృతుల కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

  • 09 Jan 2025 07:55 AM (IST)

    ప్రాణాలు కోల్పోవడం విచారకరంః వైఎస్ జగన్

    తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • 09 Jan 2025 07:54 AM (IST)

    తీవ్ర ఆవేదన కలిగించింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను

    – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..

  • 09 Jan 2025 07:51 AM (IST)

    సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

    తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలోపలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ.. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

  • 09 Jan 2025 07:41 AM (IST)

    నా మనసును కలిచివేసింది: బండి సంజయ్

    తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసింది… ఈ హృదయ విదారక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవాలి. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన సాయం అందించాలి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇకపై మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు.

  • 09 Jan 2025 07:40 AM (IST)

    తొక్కిసలాటపై సీఎం రేవంత్‌, రాహుల్‌ గాంధీ దిగ్భ్రాంతి

    తొక్కిసలాటపై తెలంగాణ సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని కోరారు.

  • 09 Jan 2025 07:39 AM (IST)

    దురదృష్టకరం: టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు

    టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు. ఓ డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా దూసుకువచ్చినట్లు చెప్పారు. వందలాదిగా దూసుకొచ్చిన భక్తులను అదుపుచేయడంలో వైఫల్యం జరిగిందన్నారు.

  • 09 Jan 2025 07:36 AM (IST)

    అండగా నిలుస్తాం: దేవాదాయ శాఖ మంత్రి

    తిరుపతిలో ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుందని.. మృతుల కుటుంబాలకి అండగా నిలుస్తామని.. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గాయపడిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య అందిస్తున్నామని తెలిపారు.

  • 09 Jan 2025 07:30 AM (IST)

    ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    తిరుమలలో టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు దిగ్భ్రాంతి చెందారు. భక్తుల మృతి బాధాకరమన్నారు ప్రధాని మోదీ. ఏపీ ప్రభుత్వానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు.

  • 09 Jan 2025 07:26 AM (IST)

    సీఎం చంద్రబాబు సమీక్ష

    తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో విఫలం కావడంపై మండిపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

Published On - Jan 09,2025 7:25 AM