08 January 2025

కోయ్..కోయ్.. కుర్రాళ్ల మనసు దోచిందిరోయ్..

Rajitha Chanti

Pic credit - Instagram

ఇన్నాళ్లు బుల్లితెరపై బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హమీదా. ఈ సీరియల్‏తో చాలా ఫేమస్ అయ్యింది. 

ఈ సీరియల్లో స్వప్న అనే పాత్రలో నటించి మెప్పించింది. మొదట్లో నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆ తర్వాత పాజిటివ్ లోకి మార్చారు.

సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించి బుల్లితెర అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ హమీదా. 

కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాల బీభత్సం సృష్టిస్తోంది. కొన్నాళ్ల క్రితమే బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకుంది హామీదా. 

ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా వరుసగా ఫోటోషూట్స్ చేస్తుంది. గ్లామర్ ఫోటోలతో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది

తాజాగా హమీదా షేర్ చేసిన ఫోటోస్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లు పద్దతిగా ఉన్న బ్యూటీని ఇలా చూసి షాకవుతున్నారు. 

బ్రహ్మముడి సీరియల్ కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టి ఫేమస్ అయ్యింది.

ఇక ఆ తర్వాత సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.