AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: నిన్నటి వరకు గ్లామర్ షో.. ఇప్పుడు యాక్షన్ మోడ్.. మార్షల్ ఆర్స్ట్ నేర్చుకుంటున్న బుట్టబొమ్మ

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ జనగణమన. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Pooja Hegde: నిన్నటి వరకు గ్లామర్ షో.. ఇప్పుడు యాక్షన్ మోడ్..  మార్షల్ ఆర్స్ట్ నేర్చుకుంటున్న బుట్టబొమ్మ
Poojahegde
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 31, 2022 | 7:41 PM

Share

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో రాబోతున్న మూవీ జనగణమన. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పూరితో ఇప్పటికే లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విజయ్. ఖుషి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. అయితే జనగణమన సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

అయితే మామూలుగానే పూరిజగన్నాథ్ సినిమాల్లో యాక్షన్స్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటాయి. ఇక జనగణమన సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది దాంతో ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా హీరోకి ధీటుగా ఉంటుందని టాక్. దాంతో పూజాహెగ్డే  కోసం.. ఏకంగా థాయ్ లాండ్ నుంచి మార్షల్ ఆర్స్ట్ ట్రైనర్ నే ముంబైకి రప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజాహెగ్డే ఫైట్ సీన్స్ సినిమాకు మరో హైలెట్ గా ఉండనున్నాయట. త్వరలోనే పూజాహెగ్డే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. ముంబై షెడ్యూల్ తర్వాత అక్కడ నుంచి షూటింగ్ కశ్మీర్ కి షిప్ట్ అవుతుందని సమాచారం.

Ileana: నీ సన్నజాజి సోయగాలను చూసేందుకు నయనాలు చాలవే..ఇలియానా న్యూ లుక్స్ వైరల్..

Vidya Balan: ఉష్..! వయస్సుతో పని ఎం ఉంది..? అందమే మాట్లాడుతుంది.. విద్య బాలన్

Super Star Krishna Birthday: ఐ లవ్ యూ నాన్న.. తండ్రికి విషెష్ చెబుతూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..

ఇవి కూడా చదవండి